Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఎంతో డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు.. బాహుబలిపై అల్లు అర్జున్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. 

Allu Arjun comments on Prabhas at Ala Vaikunthapurramuloo pressmeet
Author
Hyderabad, First Published Jan 27, 2020, 8:33 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. 

టబు, జయరాం, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల వైకుంఠపురములో చిత్రం బాహుబలి తర్వాత టాలీవుడ్ లో అంతటి పెద్ద విజయంగా నిలవడంతో సోమవారం రోజు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. 

ఈ ప్రెస్ మీట్ లో విలేఖరుల నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అల్లు అర్జున్ బాహుబలి విజయం, ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి ఘనవిజయం సాధించిన తర్వాత ప్రభాస్, రాజమౌళి గారికి పర్సనల్ గా శుభాకాంక్షలు చెప్పాను. కానీ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఆ చిత్రం గురించి మాట్లాడాలనుకుంటున్నా. 

డైరెక్టర్ పై రూమర్స్.. బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన హీరోయిన్!

బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా అందుకు అర్హుడే. మిర్చి తర్వాత బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించాడు. ఐదేళ్ల పాటు ఏనటుడైనా 5 సినిమాల్లోకి చేస్తే అందులో వర్క్ చేసే సమయం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉంటుంది. మిగిలిన రోజులన్నీ ఫ్యామిలీతో గడపొచ్చు. ఎంతో డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా అలా ఆలోచించలేదని అల్లు అర్జున్ అన్నాడు. 

రాత్రి 11:30కి ఎన్టీఆర్ ఫోన్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కామెంట్స్!

బాహుబలి సాధించిన విజయానికి, ప్రభాస్ కు దక్కిన గౌరవానికి 100 శాతం అర్హుడని అల్లు అర్జున్ తెలిపారు. ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలా సంతోషించానని బన్నీ చెప్పుకొచ్చాడు. 

మళ్ళీ పవన్ నే నమ్ముకున్న బండ్ల గణేష్ ?.. వైరల్ అవుతున్న పోస్ట్!

Follow Us:
Download App:
  • android
  • ios