మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. 

బన్నీకి జోడిగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటించింది. బన్నీ నటన ఆకట్టుకోగా, త్రివిక్రమ్ మాటలు, పూజా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక తమన్ సంగీతం గురించి ప్రతేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ ఆల్బమ్ ఇదే. ఏ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. 

అల వైకుంఠపురములో చిత్రం రెండు వారాల్లోనే 140 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బన్నీ, త్రివిక్రమ్ సమాధానాలు ఇచ్చారు. 

ప్రభాస్ ని కలసిన వైసిపి కీలక నేత.. కారణం అదేనా!

ఓ విలేఖరి.. మీ ప్రతి చిత్రానికి మెగా హీరోల నుంచి ప్రశంసలు దక్కుతుంటాయి. ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిమ్మల్ని అభినందించాడు. దీనిపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ..'మా బావ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపా.. మరోసారి సభాముఖంగా థాంక్స్ చెబుతున్నా' అని అన్నాడు. 

ఇక త్రివిక్రమ్ మాట్లాడుతూ.. అల వైకుంఠపురములో యుఎస్ ప్రీమియర్ షోలు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తనకు రాత్రి 11: 30 గంటలకు ఫోన్ చేసి అభినందించాడని అన్నారు. దీనితో మరోమారు అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య సాన్నిహిత్యం బయటపడింది. అల వైకుంఠపురములో చిత్రం విడుదలై సక్సెస్ సాధించాక ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బన్నీని అభినందించిన సంగతి తెలిసిందే.