ఈ మధ్యన బండ్ల గణేష్ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. తెలంగాణాలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేష్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్ జాయిన్ అయ్యారు. రాజకీయాలు తనకు కలసి రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వచ్చేశాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎక్కువగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ పవన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. 

రీసెంట్ గా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ఫోటోపై 'నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను' అని ఉంది. ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ రాజకీయాలని ఉద్దేశించినదే అయినప్పటికీ.. బండ్ల గణేష్ మరోసారి నిర్మాతగా పవర్ స్టార్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కొన్ని రోజుల క్రితం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బండ్ల గణేష్ పవన్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. మా బాస్ తో సినిమా చేస్తే గబ్బర్ సింగ్ ని మించేదిగా ఉంటుందని తెలిపాడు. నిర్మాతగా బండ్ల గణేష్ కు లాంగ్ గ్యాప్ వచ్చింది. టెంపర్ తర్వాత గణేష్ మరో చిత్రాన్ని నిర్మించలేదు. ఈ తరుణంలో మళ్ళీ నిర్మాతగా రాణించేందుకు గణేష్ పవన్ నే నమ్ముకున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

డైరెక్టర్ పై రూమర్స్.. బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన హీరోయిన్!

వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బండ్ల గణేష్ బాద్షా, టెంపర్, ఇద్దరమ్మాయిలతో లాంటి చిత్రాలని కూడా నిర్మించాడు. 

'ద్వారక' రహస్యాలపై నిఖిల్ కన్ను.. యంగ్ హీరోయిన్ తో రొమాన్స్!