తల్లి పాత్రలంటే టాలీవుడ్ లో ఎక్కువగా గుర్తుకు వచ్చేది నటి సుధ. హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా ఆమె పలు చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ చిత్రం మొదలుకుని నాగార్జున, వెంకటేష్, బాలయ్య, మహేష్ లాంటి అగ్రహీరోల చిత్రాలన్నింటిలో సుధ నటించారు. 

ఇటీవల నటి సుధకు అవకాశాలు తగ్గాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ప్రగతి, పవిత్ర లాంటి నటీమణుల ప్రభావం టాలీవుడ్ లో ఎక్కువవుతుండడంతో సుధకు ఛాన్సులు తగ్గాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై సుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

'రెడ్' తర్వాత క్రేజీ డైరెక్టర్ తో రామ్ మూవీ!

నా రికార్డుని ఎం వారెవ్వరూ చెరిపివేయలేరు అని సుధ అన్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలందరితో నటించా. నాగార్జునతో అయితే దాదాపు 17 పైగా చిత్రాలు చేశా. ఇప్పుడు మీరు చెబుతున్న పవిత్ర కానీ, ప్రగతి కానీ అన్ని సినిమాలు చేశారా. అసలు నేను నటించిన పాత్రలు ఎలాంటివి.. ఇప్పుడు వీళ్ళు నటిస్తున్న పాత్రలు ఎలాంటివి ? 

కరోనా హడావిడి రామ్ చరణ్ సినిమానే.. యాంకర్ హాట్ కామెంట్స్

'అతడు' లాంటి చిత్రాల్లో రెండు సీన్లు చాలు.. ఆ చిత్రం గురించి పదేళ్లయినా మాట్లాడుకుంటూనే ఉంటారు. నా కెరీర్ తీసుకుంటే గ్యాంగ్ లీడర్, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అలాంటి పాత్రలు పవిత్ర, ప్రగతి చేస్తున్నారా అని ప్రశ్నించారు. వాళ్ళని ఒక బొమ్మలా వాడుకుంటున్నారు. అంతే తప్ప వాళ్ళు చేసే పాత్రలకు ప్రాధాన్యత లేదు అని సుధ అన్నారు. 

వరుణ్ తేజ్ ఈమె వెంటపడ్డాడు.. ఎవరో గుర్తుపట్టారా(హాట్ ఫొటోస్)

బహుశా వారిద్దరికీ డబ్బు అవసరం ఏమో. అందుకే అలాంటి పాత్రలు చేస్తున్నారు అని సుధ చెప్పుకొచ్చారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే అది ఎంత పెద్ద చిత్రం అయినా అంగీకరించనని సుధ అన్నారు. మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో తల్లి పాత్రలో నటించాలని అడిగారు. కానీ ఆ సినిమాకు రెండు రోజుల పాత్రే నాది. ఇన్ని గొప్ప చిత్రాల్లో నటించిన నేను అలాంటి చిన్న పాత్ర ఎందుకు చేస్తాను అని.. అందుకే శ్రీమంతుడు చిత్రంలో తాను నటించలేదని సుధ అన్నారు.