ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం 'రెడ్' చిత్రంలో నటిస్తున్నాడు. నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. రామ్ చిరవగా పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 

రామ్ కెరీర్ ఒక అడుగు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఇకపై పొరపాట్లు చేయకూడదని.. విజయాల బాటలో సాగాలని రామ్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. దర్శకుడు మారుతి వినోదాత్మక చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

వరుణ్ తేజ్ ఈమె వెంటపడ్డాడు.. ఎవరో గుర్తుపట్టారా(హాట్ ఫొటోస్)

మారుతి చివరగా రూపొందించిన ప్రతిరోజూ పండగే చిత్రం విజయం సాధించింది. దర్శకుడు మారుతి ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. తాజా సమాచారం మేరకు మారుతి హీరో రామ్ తో ఓ చిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల మారుతి రామ్ ని కలసి కథ వినిపించాడట. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ రెడ్ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ కు రెడీ అవుతోంది.