ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు శ్వేతారెడ్డి మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం, అమ్మాయిలపై వేధింపులు జరుగుతున్నాయని శ్వేతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

తాను ఆడిషన్స్ కి వెళ్లిన సమయంలో బిగ్ బాస్ యాజమాన్యం తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు శ్వేతా రెడ్డి కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కొన్ని రోజుల క్రితం శ్వేతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. తాజాగా ఆమె ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విభిన్నంగా స్పందించారు. 

కరోనా వైరస్ అంతా కార్పొరేట్ మోసం అంటూ ఆమె ఆరోపించారు. 'ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా కరోనా వార్తలే కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలన్నీ పక్కకు వెకెళ్ళిపోయాయి. దీనిపై లోతుగా ఆలోచిస్తే కార్పొరేట్ సంస్థలు, ఫార్మా కంపెనీల కుంభకోణం అర్థం అవుతుందని శ్వేతా రెడ్డి అన్నారు. 

వరుణ్ తేజ్ ఈమె వెంటపడ్డాడు.. ఎవరో గుర్తుపట్టారా(హాట్ ఫొటోస్)

వాస్తవానికి కరోనా వైరస్ లేదని.. దీనిని ఫార్మా కంపెనీలు సృష్టించాయని ఆమె ఆరోపించారు. ఈ వైరస్ ని వ్యాపింపజేసి.. ఆ తర్వాత తామే ఈ వైరస్ కు మందు కనిపెట్టమని ఫార్మా కంపెనీలు డబ్బా కొట్టుకుంటాయి. ఆ మందుల్ని అత్యధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాయి అని శ్వేతా రెడ్డి అన్నారు. 

ఇదంతా రాంచరణ్ ధృవ చిత్రం తరహాలో ఉంటుందని అన్నారు. ఇది ఒకరకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కుట్రే అని అన్నారు. మోడీ ఇండియాకు అగ్రస్థానంలో దూసుకుపోతే పాలన అందిస్తున్నారు. దీనిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 ;లాంటి సాహసోపేతమైన నిర్ణయాలని మోడీ తీసుకున్నారు. ఇప్పుడు సిఏఏ, ఎన్నార్సి బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో కరోనాని హైలైట్ చేస్తుండడం అనుమానాలకు తావిస్తోందని శ్వేతారెడ్డి అన్నారు. 

అందాలతో హీట్ పెంచుతోంది.. అనసూయ లేటెస్ట్ ఫోటోస్

కరోనా వైరస్ చైనాలో ప్రారంభమై ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తున్న సంగతి తెలిసిందే.