తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓర్వలేక పోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రతిపక్షాలంటే నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్ప ఇలా ప్రతి దానికి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం తగదన్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఓడిపోయిన తరువాత చంద్రబాబులో మార్పు వస్తుంది అనుకున్నామని... కానీ అలా జరగలేదన్నారు. 

అమరావతి పర్యటనలో చంద్రబాబు వాహనంపై వేసిన చెప్పులు సంఘటన పై సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  తన పర్యటన కోసం తెనాలి నుంచి పెయిడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చారని అన్నారు.  సిట్ అంటే చంద్రబాబు హయాంలో సిట్ స్టాండ్ ల తయారయ్యిందని కాని వైసిపి హయాంలో అలా కాదన్నారు.

read more  రివర్స్‌ టెండరింగ్‌ మరోసారి బిగ్‌ హిట్‌ ...భారీ ప్రభుత్వ ధనం ఆదా

చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ది చెప్పిన మార్పు రాలేదన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ప్రజలు రైతులు తిరగబడ్డారని ఆరోపించారు.మోసం చేసిన చంద్రబాబుపై రాళ్లు వేయకుండా పూలు వేస్తారా..అని అన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ తో చంద్రబాబు మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజధానిలో చంద్రబాబు బినామిలు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని అన్నారు. గ్రాఫిక్స్ పేరుతో ఖర్చు చేసిన డబ్బు ప్రజలకు ఖర్చు చేసిన సంతోషంగా ఉండేవారని అన్నారు.

అమరావతితో రాజకీయాలు చేయడం ఇకనైనా చంద్రబాబు మానుకోవాలని సూచించారు. పరిహారం విషయంలోను దళితలకు చంద్రబాబు వివక్ష చూపించారని... తీసుకున్న భూములకు ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 

read more  వైఎస్సార్ లా పథకాన్ని ప్రారంభించిన జగన్... న్యాయవాదుల ఖాతాలోకి నగదు

చంద్రబాబు అమరావతి మట్టికి కాదు రైతులకు, రైతు కూలీలకి సాష్టాంగ నమస్కారం చేయాలన్నారు. అంబెద్కర్ స్మృతి వనమని చెప్పి చంద్రబాబు దళితులని మోసం చేశారని... సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆదారిటీగా మార్చేశారన్నారు. 

రాజధాని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ను అమరావతి శిల్పి అంటారా లేదా దొంగ అంటారా అని ప్రశ్నించారు. దండుపాళ్యం ముఠాలా చంద్రబాబు అండ్ బ్యాచ్ దోచుకున్నారని...లింగమనేనికి 4 వేల కోట్ల లబ్ది చేకూర్చారన్నారు. చంద్రబాబు మళ్ళీ రాజధానికి వస్తే ఈసారి ప్రజలు తరిమి తరిమి కొడతారని శ్రీదేవి అన్నారు.