Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ లా పథకాన్ని ప్రారంభించిన జగన్... న్యాయవాదుల ఖాతాలోకి నగదు

ఆంధ్ర ప్రదేశ్ లోని లాయర్ల కోసం సీఎం జగన్ వైఎస్సార్ లా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా లబ్దిదారులైన జూనియర్ లాయర్లకు నెల నెలా ఐదువేల రూపాయలు అందించనున్నారు. 

CM Jagan Inaugurates 'YSR law' Scheme
Author
Amaravathi, First Published Dec 3, 2019, 7:37 PM IST

అమరావతి: వైయస్సార్‌ లా నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతినెలా జూనియర్‌ న్యాయవాదులకు రూ.5వేల రూపాయలు అందించనున్నారు. ఈ మేరకు మొదటి నెల డబ్బులను సీఎం సభావేధికపై నుండే లబ్ధిదారులైన న్యాయవాదుల అక్కౌంట్లలోకి  జమచేశారు. 

వైయస్సార్‌ లా నేస్తం కింద దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా జూనియర్‌ న్యాయవాదులకు నెలనెలా రూ.5వేలు స్టైఫండ్‌ ఇవ్వడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ గురించి మొదటిసారి ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్ కు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

video:ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన పోలీస్... అభినందించిన జగన్

అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరుపైనా సీఎంకు న్యాయవాదుల కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం చట్టంలో సవరణలపై మార్పులు తీసుకువస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ఏపీ బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, వైస్‌ ఛైర్మన్‌ రామజోగేశ్వర్రావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు రామిరెడ్డి, సీనియర్‌ న్యాయవాది చిత్తరువు నాగేశ్వర్రావు, ఆర్‌.మాధవి, బార్‌కౌన్సిల్‌ సభ్యులు బివి. కృష్ణారెడ్డి, వి.బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios