రివర్స్ టెండరింగ్ మరోసారి బిగ్ హిట్ ...భారీ ప్రభుత్వ ధనం ఆదా
రివర్స్ టెండరింగ్ మరోసారి ఏపి ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని మిగిల్చింది. గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం కోనుగోలు చేయనున్న సెల్ పోన్ల విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించి భారీ ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ఏపి ప్రభుత్వం తెలిపింది.
అమరావతి: ఏపి ప్రభుత్వం చేపడుతున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మరోసారి ప్రభుత్వానికి భారీగా నిధులు మిగిల్చింది. గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం కొనుగోలుచేయాలని భావించిన సెల్ ఫోన్ల కోసం ఇదివరకే ప్రభుత్వం బిడ్డింగ్ నిర్వహించింది. అయితే తాజాగా మరోసారి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా దాదాపు రూ.83 కోట్లు ఆదా అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
గ్రామ,వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 సెల్‌ఫోన్లను ఏపీటీఎస్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నవంబర్ 30న తొలిదశ బిడ్డింగ్ తెరిచారు. ఇందులో రూ. 317.61 కోట్లకు ఓ కంపనీ కోట్‌చేసి ఎల్–1 గా నిలిచింది. దీనిపై ఏపిటిఎస్ రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ.233.81 కోట్లకు కోట్ చేసిన కంపనీ బిడ్ దక్కించుకుంది. రివర్స్‌టెండరింగ్‌లో 26.4 శాతం తక్కువకు దక్కించుకు దక్కించుకుంది.
read more గుంటూరులో మధ్య విమోచన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు
తొలిదశ బిడ్డింగ్ కన్నా రూ. 83.8 కోట్ల మేర తక్కువకు కోట్ చేసిన కంపనీ దీన్ని దక్కించుకుంది. ఇలా ఏపీటీఎస్ టెండర్లలో భారీగా ప్రజా ధనం ఆదా అయి రివర్స్ టెండరింగ్ మరోసారి బిగ్ హిట్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
గ్రామ, వార్డు వాలంటీర్లకు అందించనున్న ఈ సెల్‌ఫోన్ లకు ఒక ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యాం, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్ ప్రొసెసర్ ను కలిగివున్నాయి. దీంతోపాటు మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను కూడా సదరు కంపనీయే నిర్వహించనుంది.
read more మంత్రికో న్యాయం... సామాన్య మహిళకో న్యాయమా...: పద్మజ అరెస్ట్ పై టిడిపి శ్రేణుల సీరియస్
మూడేళ్లపాటు మాస్టర్ డేటా మేనేజ్‌మెంట్, టైప్ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌బీ టూ మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టెంపర్డ్ గ్లాస్, బ్యాక్ కవర్,రెండు, మూడో సంవత్సరాల్లో కూడా మెయింటినెన్స్, వాకిన్ సపోర్ట్ ను బిడ్ దక్కించుకున్న కంపనీ అందించనుంది.