చంద్రబాబుకు మానసిక సమస్యలు... సింగపూర్ లో చికిత్స: మంత్రి అనిల్
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పోలవలం విషయంలో చంద్రబాబు మాట్లాడే ప్రతి మాటా అబద్దమేనని అన్నారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం పనుల పురోగతిని వివరించడమే కాదు ఈ విషయంలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
వచ్చే ఏడాది అంటే 2020 నాటికి ప్రాజెక్టు స్పిల్, కాపర్ డ్యాం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి నవంబర్ ఒకటి నుండి తిరిగి పనులు ప్రారంబించామని తెలిపారు. ముఖ్యంగా స్పిల్ వే పనులను వేగంగా జరుపుతున్నట్లు... జూన్ కల్లా స్పిల్ వేను పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
ఇక కాపర్ డ్యాంను కూడా ఇదే సమయంలో పూర్తి చేస్తామన్నారు. కాపర్ డ్యాం నిర్మాణ పనులను ముందుగానే చేపట్టడం వలన ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో ఏజెన్సీ ప్రాంతాలు మునిగాయినట్లు ఆరోపించారు. ఇలా ప్రమాదకరమైన ప్రాంతాల్లో వున్న దాదాపు 18,000 కుటుంబాలను వచ్చే ఏడాది మే నెల వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు.
read more ''జగన్ ది ''కంత్రి''వర్గం... ముందు బూతు మీడియం తర్వాతే ఇంగ్లీష్ మీడియం''
ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగానే స్పిల్ వేను ప్రారంభించి రైతులకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ పనులను డిసెంబరు ఒకటి నుండి మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు.
ఇప్పటికి అబద్దాలు చెప్పిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 23 స్దానాలకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. అయినా కూడా వారిలో మార్పు రాలేదని... ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకొరని హెచ్చరించారు.
గత ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని.... ఇష్టం వచ్చినట్లు మాట్లాడతే ఊరుకోమని హెచ్చరించారు. ఆయన వంకర బుద్దిని మార్చుకోకుంటే తగిన విధంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు.
read more బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది: నారా లోకేశ్
ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టును తాము కట్టి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్ల రుపాయలు ప్రజాధనం కాపాడామని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు పదవిని కోల్పోయి మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తనకెంతో ఇష్టమైన సింగపూర్ వెళ్లి చికిత్స చెయించుకోవాలని సూచించారు.
రూ.55,000 కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ 17000 కోట్ల రూపాయల పనిమాత్రమే జరిగిందని వివరించారు.కేవలం 30 శాతం పూర్తి చేసిన చంద్రబాబు 75 శాతం పూర్తి చేశామని అబద్దాలు చెబుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.