రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల ఎండీవో కార్యాలయం వైసిపి నేతలకు అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డాగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరిలు ఆరోపించారు. ఈ  కార్యాలయంలో ఎంపిటిసి నామినేషన్ల పరిశీలన సందర్భంగా వెళ్లిన టిడిపి నాయకులతో డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్, వైసిపి నాయకుల ప్రోద్భలంతో పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు టిడిపి ఎంపిటిసి  అభ్యర్థులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని... వారి ప్రాణాలకు హాని తలపెడతారన్న భయాందోళనను వ్యక్తం చేశారు. 

నామినేషన్ల పరిశీలన సమయంలో వైకాపా నాయకులతో వాదనకు సమాధానం ఇస్తున్న టిడిపి నాయకుడు బుజ్జువరపు శ్రీనివాస చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ లో నిర్బంధించారని పేర్కొన్నారు. ఎండీవో కార్యాలయం నుంచి టిడిపి నేతలను మాత్రమే బయటకు పంపి వైసిపి నాయకులను వదిలేయడాన్ని ప్రశ్నించిన తనను ఓ గిరిజన మహిళ అనకూడా చూడకుండా సీఐ దుర్బాషలాడారని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

read more  స్థానికసంస్థల ఎన్నికలు: చిత్తూరు వెనక్కి... టాప్ లో తూర్పు గోదావరి

రంపచోడవరం నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు ఉదయ భాస్కర్  ప్రొద్భలంతోనే పోలీసులు రెచ్చిపోతున్నారని... టిడిపి నాయకుల అక్రమ అరెస్టులు ఇప్పటికీ జరుగుతూనే వున్నాయని రాజేశ్వరి ఆరోపించారు.  అడ్డతీగలలో టిడిపి ముఖ్య నాయకులు కనబడిన వారిని కనపడినట్లు పోలీసులు అరెస్టు చేయిస్తున్నారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

టిడిపి నాయకులకు ప్రాముఖ్యత లేకుండా చేయాలని పోలీసులను ఉపయోగించుకుని ఉదయ భాస్కర్ కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల అధికారికి లేఖ రాశానని వంతల రాజేశ్వరి తెలిపారు.  

read more  మాపై మాచర్లలో హత్యాయత్నం...స్కెచ్ వేసింది ఎక్కడంటే...: బోండా ఉమ

ప్రస్తుతం ఇద్దరు ఎంపీటీసీలను ప్రలోభపెట్టడానికి ఎటు తీసుకుని వెళ్ళారో తెలియడం లేదని ఆమె పేర్కొన్నారు. 144 సెక్షన్  ఉందని ముందు చెప్పకుండా టిడిపి నాయకులను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు లాక్కొని వెళ్ళి కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.