Asianet News TeluguAsianet News Telugu

స్థానికసంస్థల ఎన్నికలు: చిత్తూరు వెనక్కి... టాప్ లో తూర్పు గోదావరి

స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు భారీ  సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 

AP Local Body Elections: District wise Nominations Details
Author
Vijayawada, First Published Mar 12, 2020, 6:19 PM IST

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్నికల ప్రక్రియ మొదలవడమే కాదు నిన్నటి(బుధవారం)తో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ భారీసంఖ్యలో జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్లు దాఖలయ్యాయి. 

జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో మార్చి 11వ తేదీ నాటికి జిల్లాల వారిగా దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు ఈ విధంగా వున్నారు. బుధవారం  నాటికి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న  652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 4778  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఒక్కరోజే 4355 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. మార్చి 9వ తేదీన కేవలం 68, మార్చి 10న 355 నామినేషన్లు దాఖలవగా చివరిరోజు మాత్రం భారీసంఖ్యలో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు.
 ఎంపిటిసి (మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల)లకు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి.  

జిల్లాల వారిగా జడ్పిటిసి నామినేషన్ల వివరాలు 

1) శ్రీకాకుళంలో 38 స్ధానాలకు 281 నామినేషన్లు (9వ తేదీ 1, 10వ తేదీ 22, 11వ తేదీ 258)

2) విజయనగరంలో 34 స్ధానాలకు 241 నామినేషన్లు (9వ తేదీ 2, 10వ తేదీ 33, 11వ తేదీ 206)

3) విశాఖపట్నంలో 39 స్ధానాలకు 296  నామినేషన్లు (9వ తేదీ 3, 10వ తేదీ 26, 11వ తేదీ 296)

4) తూర్పుగోదావరిలో 61  స్ధానాలకు 482 నామినేషన్లు (9వ తేదీ 2, 10వ తేదీ 51, 11వ తేదీ 429)

5) పశ్చిమగోదావరిలో 48 స్ధానాలకు 370 నామినేషన్లు (9వ తేదీ 6, 10వ తేదీ 35, 11వ తేదీ 329)

6) కృష్ణాలో 46 స్ధానాలకు 331 నామినేషన్లు (9వ తేదీ 2, 10వ తేదీ 26, 11వ తేదీ 303)

7) గుంటూరు 54 స్ధానాలకు 388 నామినేషన్లు (9వ తేదీ 2, 10వ తేదీ 24, 11వ తేదీ 362)

8) ప్రకాశం 55 స్ధానాలకు 394 నామినేషన్లు (9వ తేదీ 6, 10వ తేదీ 14, 11వ తేదీ 374 )

9) ఎస్పీ నెల్లూరు 46 స్ధానాలకు 330 నామినేషన్లు (9వ తేదీ 7, 10వ తేదీ 15, 11వ తేదీ 308)

10) కర్నూలు 53 స్ధానాలకు 351 నామినేషన్లు (9వ తేదీ సున్నా, 10వ తేదీ 20, 11వ తేదీ 330)

11) అనంతపురం 63స్ధానాలకు 474 నామినేషన్లు (9వ తేదీ 9,10వ తేదీ 27, 11వ తేదీ 438)

12) చిత్తూరు 65స్ధానాలకు  480 నామినేషన్లు (9వ తేదీ 22, 10వ తేదీ 37, 11వ తేదీ 421)

13) వై ఎస్ ఆర్ కడప 50 స్ధానాలకు  341నామినేషన్లు (9వ తేదీ 6,10వ తేదీ 35,11వ తేదీ 300)  

Follow Us:
Download App:
  • android
  • ios