అనంతపురం జిల్లాలో దారుణం ఘటన చోటుచేసుకుంది. అధికార అండతో ఓ వైసిపి నేత నిత్యం వేదింపులకు గురిచేయడంతో తట్టుకోలేకపోయిన ఓ అంగన్‌వాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె చావుబ్రతుకుల మధ్య అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రొద్దం మండలంలోని దంతేపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ అంగన్ వాడి కార్యకర్తగా పనిచేస్తోంది. అయితే రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆమెపై వేధింపులు మొదలయ్యాయి. అధికార పార్టీ అండతో స్థానిక వైసిపి నేత సంపత్ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. 

అలివేలమ్మను అంగన్ వాడి కార్యకర్త ఉద్యోగం నుండి తొలగించడానికి అధికారుల సాయంతో సంపత్ విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో ఉద్యోగం ఊడితే ఎలా అని నిత్యం ఆవేదనతోనే  ఆమె ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల మండలస్థాయి అధికారుల నుండి మూడవ మెమో జారీ అవడంతో మరింత ఆవేధనకు  లోనయిన అలివేలమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. 

video:మూడు రాజధానులు వద్దు...ఒకటే రాజధాని ముద్దు: గుంటూరు రైతుల ఆందోళన
 
దీన్ని  గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుత ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అలివేలమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే వున్నట్లు  డాక్టర్లు చెబుతున్నారు. 

ఈ దారుణానికి కారణమైనవారిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోడానికి కూడా స్థానిక పోలీసులు వెనుకడుగు వెస్తున్నట్లు ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. బాధితురాలిని స్థానికి టిడిపి నాయకులు పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని... బాధితులపై  పోలీసులు  చర్యలు తీసుకునే వరకు పోరాడతామన్నారు. అంగన్వాడి యూనియన్లకు చెందిన నాయకులు అలివేలమ్మను పరామర్శించారు. 

read more  ఏపి ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు...భయాందోళనలో ప్రయాణికులు