కర్నూలు జిల్లాలో ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు, లారీ మితిమీరిన వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ఘటన ప్యాపిలి మండలం పోదొడ్ధి గ్రామ శివారులలో చోటుచేసుకుంది. బెంగళూరు నుండి ప్రయాణికులతో హైదరాబాద్ కి వెళ్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు పొదొడ్డి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా అతివేగంతో  వచ్చి ఢీకొన్నాయి. 

read more  హైదరాబాద్‌లో దారుణం...పురిటిబిడ్డ బ్రతికుండగానే పూడ్చిపెట్టే ప్రయత్నం

తెల్లవారుజామున డ్రైవర్లిద్దరు నిద్రమత్తులో వుండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అలాగే బస్సు మితిమీరిన వేగం కూడా మరో కారణంగా ప్రత్యక్షసాక్షులు  చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

బస్సు ముందుబాగం పూర్తిగా ద్వంసమయ్యింది. అందులో ఇరుక్కున వారిని బయటకు తీసి కాపాడిన పోలీసులు రోడ్డుపైనుండి వాహనాలకు క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. 

 read more  భవన నిర్మాణ కార్మికుడి భార్య అనుమానాస్పద మృతి

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప గుత్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.