కర్నూల్: జిల్లాలోని నంద్యాల పట్టణంలో బుధవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నిత్యం ప్రజలతో బిజీబిజీగా వుండే బిజీగా వుండే చోట ఓ జువెల్లరీ షాపులో దోపిడీకి  పాల్పడ్డ దుండగులు భారీ బంగారం, నగదును దోచుకున్నారు. ఈ వ్యవహారమంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే ముగించిన దొంగలు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. 

ఇలా ఎప్పుడూ జనసంచారం వుండే చోట ఇలా చోరీకి పాల్పడిన దొంగలు నంద్యాల పోలీసులకు సవాల్ విసిరారు. పట్టణంలోని మెయిన్ బజార్ లో గల నిమిషాంబా జ్యూవెలర్స్ లోకి చొరబడ్డ దొంగల ముఠా సుమారు 3 కేజీల బంగారు ఆభరణాలు,  5.5 లక్షల నగదు దోచుకుని పరారైనట్లు  తెలస్తోంది. జ్యూవెలరి షాప్ వెనకాల నుండి షాప్ లోకి ప్రవేశించి దుండగులు అక్కడున్న సిబ్బందిని బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ చిదానంద రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకోవడంతో పాటు షాపు సమీపంలోని సిసి కెమెరాల ఆదారంగా విచారణ  ప్రారంభించారు. ఇంత భారీ బంగారాన్ని కలిగి షాప్ కనీసం సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం పలు  అనుమానాలకు తావిస్తోంది. 

read more  వెంకన్న భక్తులపై అదనపు భారం... టిటిడి కీలక నిర్ణయం

నంద్యాల నడిబొడ్డున ఉన్న మెయిన్ బజార్ బంగారు అంగళ్ల వీధిలో ఉన్న నిమిషాంబ జ్యువెలర్స్ షాప్ లో గత రాత్రి భారీ చోరీ ఘట చోటుచేసుకుంది..రోజు లాగానే షాపులో పనిచేసే వర్కర్లు తాళాలు వేసి రాత్రి ఇంటికి వెళ్ళిన అనంతరం అర్ధరాత్రి సమయంలో దొంగలు షాపు వెనకాల నుండి డోర్లు పగలగొట్టుకుని షాప్ లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.

షాప్ లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పాటు దాదాపు ఐదున్నర లక్షల నగదు అపహరించుకొని వెళ్లినట్లు షాపు యజమాని  అందించిన వివరాలను బట్టి తెలస్తోందన్నారు. కూతవేటు దూరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండడం... 20 ఏళ్ల నుంచి షాపు నడుపుతున్నా యాజమాన్యం కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొవడం ఇందులో కొసమెరుపు.

ఉదయం షాపు తెరిచేందుకు రాగా వెనకాల వైపు డోర్లు అన్ని చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించిన షాపు యజమాని మరియు వర్కర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన సిబ్బంది దొంగతనం జరిగిన ఘటన పై డీఎస్సీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన  కూడా ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు. 

read more  అగ్రిగోల్ కుంభకోణం: బాబు, లోకేశ్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

జువెలరీ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. అతిత్వరలో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని  చిదానంద రెడ్డి తెలిపారు. దొంగతనానికి గురైన వివరాలను షాప్ యజమాని వెంకన్న వర్మ నుండి సేకరించినట్లు ఆయన తెలిపారు.