Asianet News TeluguAsianet News Telugu

వెంకన్న భక్తులపై అదనపు భారం... టిటిడి కీలక నిర్ణయం

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర  స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్ళే భక్తులపై టిటిడి అదనపు భారం  మోపింది. ఇప్పటికే వివిధ చార్జీల రూపంలో భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్న టిటిడి తాజాగా వసతి సదుపాయాన్ని కూడా మరింత ప్రియం చేసింది.   

TTD officials hike the rental prices in Tirumala
Author
Tirupati, First Published Nov 7, 2019, 4:07 PM IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శనంకోసం తిరుమల వెళ్లే భక్తులపై టిటిడి మరో బారాన్ని మోపింది. భక్తుల బసకోసం నిర్మించిన భవనాల్లో అద్దెగదుల ధరలను పెంచుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

నందకం అద్దె గదులను రూ. 600 నుంచి వేయి రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు. కౌస్తుభం, పాంచజన్యంలోని గదుల అద్దెలను కూడా రూ.  500 నుంచి వేయి రూపాయలకు పెంచారు.ఈ పెంపు ధరలు ఇవాళ్టి(గురువారం) నుండే అమలులోకి తెచ్చినట్లు టిటిడి వెల్లడించింది. 

ఇప్పటికే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతూ దైవదర్శనానికి ముందే నిలువుదోపిడీ చేస్తున్నారు. దళారుల వ్యాపారం మూడు దర్శనాలు... ఆరు డబ్బులు అన్నట్లుగా బేషుగ్గా సాగుతున్న విషయం ఇటీవలే బయటపడింది.  

గత రెండు నెలల కాలంలోనే మొత్తం 300 మంది దళారులను టిటిడి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.  ఇటీవల 17 వేలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయిస్తుండ ఓ ముగ్గురు దళారులను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ దళారుల్లో ఒకడైన మధుసూదన్ టిటిడి ఉద్యోగి.  భక్తులను భగవంతుడి దర్శనానికి అనుమతించే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అతడు అటెండర్ గా పనిచేస్తున్నాడు. 

 read more  గోవిందా..గోవిందా: తిరుమల నిండా దళారుల దందా!

ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో సేవ టిక్కెట్లను సంపాదించిన వీరు వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కేవలం సేవ టిక్కెట్లే కాకుండా విప్ బ్రేక్ దర్శనాలకు కూడా అక్రమంగా డబ్బులు తీసుకొని టిక్కెట్లు లేకుండానే భక్తులను అనుమతిస్తున్నట్టు తేలింది. 

 అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళారులకు గడ్డుకాలం మొదలైంది. క్యూలైన్ల వద్ద అనుమానం కలిగిన టిక్కెట్లను తనిఖీలు చేయడం ప్రారంభించడంతో దళారుల బాగోతం బయటపడుతోంది.  తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న దళారి చారి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన 46 మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై కొందరు దర్శనాలు పొందినట్లుగా అధికారులు గుర్తించారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫారసు లేఖపై 36 సార్లు టిక్కెట్లు పొందగా.. అంబర్‌పేట ఎమ్మెల్యే సిఫారసుపై 23, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు పొందారు.

read more  కీలక అదికారిపై బదిలీ వేటు: టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్..?

అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ, ప్రస్తుత హోంమంత్రులను సైతం దళారులు వదిలిపెట్టలేదు. ఒక్క దళారే వందల సార్లు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయించాడు.

ఇలా దళారుల బారిన పడి ఎంతోమంది భక్తులు భారీగా డబ్బులు పోగెట్టుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు తాజాగా అద్దెగదుల రేట్లు పెంచడంతో భక్తులపై మరో భారం అదనంగా పడనుంది. దీంతో టిటిడి నిర్ణయాన్ని భక్తులు వ్యతిరేకించే అవకాశాలున్నాయి.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios