Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్ కుంభకోణం: బాబు, లోకేశ్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు

ap assembly speaker thammineni seetharam sensational comments on chandrababu naidu over agrigold scam
Author
Vijayawada, First Published Nov 7, 2019, 4:45 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు.

ఎనిమిది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కంపెనీ మోసాలకు పాల్పడిందని.. అయితే బాధితులకు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రపదేశే మాత్రమేనని తమ్మినేని స్పష్టం చేశారు.

హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని... ఈ వ్యవహారంలో సీఎం రమేశ్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు.

Also Read:అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: రేపటి నుంచి చెల్లింపులు.. జగన్ సర్కార్ నిర్ణయం

అగ్రిగోల్డ్ బాధితుల తిరుగుబాటు, పోరాటం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి అడుగు ముందుకు వేయలేకపోయారని.. ఒక రకంగా హాయ్‌ల్యాండ్ ఆస్తుల్ని బాధితులే రక్షించుకున్నారని స్పీకర్ ప్రశంసించారు. 

తొలి కేబినెట్ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్‌లో రూ.1,151 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా గత నెల 18న రూ.263 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3,69,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించనుంది. 

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చర్యలు చేపట్టింది. బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలోంచి తాజాగా రూ.269.99 కోట్లు మంజూరు చేశారు. 

Also Read:రాజ్యాంగబద్దం కాదు...అయినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం...: అప్పిరెడ్డి

ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. గుంటూరు జిల్లాలో 19,751 బాధితులకు రూ. 14,09,41,615లు, చిత్తూరుకు జిల్లాలో 8,257 మందికి రూ. 5,81,17,100 తూర్పుగోదావరి జిల్లాలో 19,545 మందికి  రూ. 11,46,87,619, పశ్చిమగోదావరి జిల్లాలో 35,496 మందికి రూ. 23,05,98,695, విజయనగరం జిల్లాలో 57,941 మంది బాధితులకు  రూ. 36,97,96,900, శ్రీకాకుళం జిల్లాలో 45,833 మందికి రూ. 1,41,59,741 మంది వున్నారు. 

అలాగే కర్నూలు జిల్లాలో 15,705 మందికి రూ. 11,14,83,494, నెల్లూరు జిల్లాలో 24,390 మందికి రూ. 16,91,74,466, కృష్ణా జిల్లాలో 21,444 మందికి రూ. 15,04,77,760, అనంతపురం జిల్లాలో 23,838 మందికి రూ. 20,64,21,009, వైయస్సార్‌ కడప జిల్లాలో 18,864 మందికి రూ. 13,18,06,875, ప్రకాశం జిల్లాలో 26,586 మందికిరూ. 19,11,50,904,  విశాఖపట్నం జిల్లాలో 52,005 మందికి రూ. 45,10,85,805  రూపాయలను తొలివిడతలో చెల్లించనున్నారు. మొత్తమ్మీద 3,69,655 మందికి రూ.263.99 కోట్లు చెల్లించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios