ప్రకాశం జిల్లా ఒంగోలులో తల్లిబిడ్డల హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు కోటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్ట వద్ద తల్లీకూతుళ్ల మృతదేహాలను గుర్తించారు. 

వీరు ఎవరు... ఇక్కడ ఎవరు చంపారు అన్న కోణంలో పోలీసులు సుధీర్ఘంగా విచారణ చేపట్టారు. భార్యాబిడ్డలను హత్య చేసిన తర్వాత మృతదేహాలను కోటి తగులబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Also Read:మరో దారుణం: తల్లిని రాయితో కొట్టి, బిడ్డను గొంతు కోసి.. కాల్చేశారు

ఈ నెల 3న మద్దిపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల మధ్య రోడ్డు పక్కన కాల్చిన స్థితిలో ఉన్న మహిళ, చిన్నారి మృతదేహాలను కొందరు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులు: మమ్మల్ని కొట్టి రివాల్వర్ లాక్కొన్నారు

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన మహిళ తల వెనుక రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన పోలీసులు... ఆమెను రాయితో కొట్టి చంపివుంటారని భావిస్తున్నారు. అలాగే ఆమె ఏడాది వయసున్న కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.