అమరావతి: దిశ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించిన రోజున లావణ్య అనే అమ్మాయిని లక్ష్మణ రెడ్డి అనే అబ్బాయి అత్యాచారం చేశాడని...  అయితే ఈ చట్టం వల్లే ఈ రేప్‌ జరిగిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేయడంపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈ విషయం స్పీకర్‌ దృష్టికి తెస్తున్నానని మంత్రి కన్నబాబు తెలిపారు. 

ఎస్సీల అభ్యున్నతి కోసమే పుట్టినట్లు  చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. కానీ 2009-2014లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ శాసనసభలో ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌ ఇవ్వాలని కీలకమైన చట్టం చేసిందని... కానీ అప్పుడు ఇదే చంద్రబాబు ప్రతిపక్షనాయకుడుగా ఉన్నా కనీసం పట్టించుకోలేదని అన్నారు. పాదయాత్ర చేస్తున్నారనే సాకుతో సభకు కూడా రాలేదని కన్నబాబు గుర్తు చేశారు. 

గత ఐదేళ్ల టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించిన చంద్రబాబు స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.  ఆయన  చేసిన దొంగ దీక్షలకీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల్ని మళ్లించి వాడుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more అల్లూరి సీతారామరాజు ను తలపిస్తున్న జగన్...వీరిద్దరూ...: పుష్ప శ్రీవాణి
 
దిశ చట్టాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని తాము గర్వంగా చెప్పుకుంటున్నామని  అన్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా అలాంటి చట్టం  గురించి ఆలోచించారా...? ఆ దమ్ము వాళ్లకు ఉందా? కనీసం మహిళల గురించి ఆలోచించారా అని కన్నబాబు ప్రశ్నించారు. 

టీడీపీ హయాంలో జరిగిన ఘటనలు, నమోదయిన కేసుల గురించి ఇవాళ్టికీ పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి గురించి మాట్లాడారా? ఐదేళ్లలో ఆయేషా కేసు గురించి చంద్రబాబు హయాంలో ఏమైనా చేశారా? అని కన్నబాబు నిలదీశారు. 

చంద్రబాబు ఏ రోజు చిత్తశుద్ధితో పనిచేయలేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ ఏ విధంగా తప్పుపట్టాలి? ఏ విధంగా దుయ్యబట్టాలి, బురదచల్లాలనే ఏకైక అజెండాతో చంద్రబాబు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బిల్లుపై చంద్రబాబు మాట్లాడటంపై గౌరవ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని, ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారని కన్నబాబు తెలిపారు. 

దయచేసి చంద్రబాబు వక్రీకరణ చేయటం మానుకుని సూటిగా మాట్లాడాలని స్పీకర్‌ ద్వారా పదే పదే కోరుతున్నానని కన్నబాబు తెలిపారు. అయినా చంద్రబాబు తన మాటతీరు మార్చుకోవటం లేదన్నారు. 

read more  దిశ చట్టంపై స్పందించిన డిల్లీ సర్కార్... జగన్ ప్రభుత్వానికి లేఖ

కేవలం 21 రోజుల్లోనే అత్యాచార నిందితులను ఉరితీయాలని దిశ చట్టంలో పొందుపర్చినట్లు గుర్తుచేశారు. ఈ దిశ చట్టాన్ని ప్రశంసిస్తూ వివరాలను పంపమని ఢిల్లీ ప్రభుత్వం కోరిందని స్పీకర్‌ తెలిపారని కన్నబాబు అన్నారు. ఇలా దేశం మొత్తం మనవైపు తిరిగి చూస్తోందని... ఇంత గొప్ప చట్టాన్ని తయారు చేసి నాయకుడ్ని మేం అనుసరిస్తామని అంటోందని మంత్రి తెలిపారు.

వీటన్నింటిని గమనించకుండా చంద్రబాబు  కేవలం కడుపుమంటతో మాట్లాడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల మీద చంద్రబాబుకు ఎంత ప్రేమ వుందో... ఆయన ఏకరంగా కులాల మధ్య విభజన చేస్తారో ఈదేశం, రాష్ర్టం ఇదివరకే చూసిందని కన్నబాబు ఎద్దేవా చేశారు.