విశాఖపట్నం: ఎన్నో సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మక కలెక్టర్ కార్యాలయంకు రావడం ఎంతో ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జిల్లాలో మన బడి నాడు నేడు కార్యక్రమంను తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కన్నబాబు,  పర్యాటక సాంస్కృతిక మరియు క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా  నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వీరు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... నాలుగు నెలల్లోనే సచివాలయాల ఉద్యోగాలు, వాలంటీర్ల నియామకాలను చేపట్టామన్నారు.

పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్లు....కార్పొరేట్ స్కూల్స్ వలే ఇంగ్లీషు మీడియం విద్యా బోధనను తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ స్కూల్స్ ఏర్పాటు చేయడం వలన ధనిక, పేద వర్గాల మధ్య అంతరం తగ్గుతుందన్నారు. 

read more  విశాఖ భూ అక్రమాల్లో చంద్రబాాబు... జగన్ కు కన్నా ఫిర్యాదు

జిల్లాలో 33 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, నియోజకవర్గాల వారీగా రేటు కార్డులు ప్రకటించనున్నట్లు తెలిపారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుకను తీసుకొనే విధంగా అనుమతులు 

ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా చేయబడుతుందని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా, తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చే ఇసుక పక్క దారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా, అమ్మినా రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు మంత్రి తెలిపారు. 

read more అధికారంలోకి వస్తూనే దోపిడికి ప్లానింగ్.. జే ట్యాక్స్ అమలు: జగన్‌పై చంద్రబాబు ఫైర్

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ... గతకొద్దిరోజులుగా వరదల వలన ఇసుకకు కొద్దిగా ఇబ్బంది వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం ఆ కొరతను అధికమించామన్నారు.

 కార్పొరేట్ స్కూల్ ల వలే ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనను నిరుపేద విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటులో అమ్మఒడి తదితరమైనవి అమలు చేయనున్నామని అన్నారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నామన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన, విఎంఆర్డిఏ కమిషనర్ కోటేశ్వరరావు, డిఆర్ఓఎం శ్రీదేవి, ఆర్డీఓ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.