విశాఖలో గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ గ్రూప్ కు చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ కు కన్నా ఓ లేఖ రాశారు. 

ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కోసం లులూ గ్రూప్ తో పాటు సీఎంఆర్ గ్రూప్ కు చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా భూ కేటాయింపులు  చేసిందని ఆయన ఆరోపించారు. అయితే ఇప్పటికే లులూ గ్రూప్ కు చేసిన 13.84 ఎకరాల భూకేటాయింపులను రద్దు చేసిందని గుర్తుచేశారు. ఈ భూకేటాయింపుల వ్యవహారంలో తీవ్ర అవినీతి ఉందని గ్రహించిన ప్రభుత్వం రద్దు చేసినట్లు భావిస్తున్నామన్నారు. 

అయితే సీఎంఆర్ గ్రూప్ కు కేటాయించిన 4.85 ఎకరాల భూకేటాయింపులను కూడా రద్దు చేయాలని కన్నా కోరారు. అందులో కూడా భారీ అవినీతి దాగివుందని ఆరోపించారు. 
ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పేరుతో జరిగిన ఈ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వానికి కన్నా డిమాండ్ చేశారు. 

read more  విశాఖ భూ కుంభకోణం...టిడిపి కార్యాలయ భవనం కూడా..: వైసిపి ఎమ్మెల్యే

విశాఖ భూ కుంభ కోణంలో ప్రధాన  పాత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ లేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. లోకేష్ కు మాటలు రావు గానీ మూటలు సర్దడం చాలాబాగా వచ్చిని...ఇది విశాఖ భూకుంభకోణంలో బయటపడిందని ఎద్దేవా చేశారు. 

గతంలో ఈ భుకుంభకోణంపై ఏర్పాటుచేసిన సిట్ నివేదిక బయట పెట్టమని అప్పటి ప్రభుత్వాన్ని ప్రతి పక్ష వైఎస్సార్‌సిపి తరపున చాలాసార్లు డిమాండు చేశారు. కానీ చంద్రబాబు సారథ్యంలోని టిడిపి సర్కారు స్పందించ లేదు. అప్పటి క్యాబినెట్ మంత్రి  గంటా కూడా నివేదిక బయట పెట్టమని కోరమని...ఆయన కూడా స్పందించలేదని గుర్తుచేశారు. 

విశాఖలో నిర్మించిన టిడిపి కార్యాలయ భవనం కూడా భూ కుంభ కొణంలో భాగమేనని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణకు కూడా తాజాగా ఏర్పాటుచేసిన సిట్ ని ఆశ్రయిస్తామన్నారు. 

read more  70 ఏళ్ల వయసులో చంద్రబాబు పోరాటం...అందుకే మా మద్దతు: రాపాక

 విశాఖ భూకుంభకోణంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ పేరున్నట్టు బాగా ప్రచారం జరిగింది. ఇందులో నిజంగా ఎవరి పాత్ర వున్నా తప్పకుండా చర్యలు తీసుకోవలని సిట్ ను కోరతామన్నారు. 

విశాఖలో ల్యాండ్  పూలింగ్ పేరిట 600 నుంచి 700 కోట్ల  విలువైన భూములు టిడిపి నాయకులు సొంతం చేసుకున్నారు.. టిడిపి నాయకుల దోపిడిపై విచారణ జరిపించడం తప్పా...? అని ప్రశ్నించారు.