విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం తమ ఆయుధాలు కి వేదమంత్రాల నడుమ శాస్త్రయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధాలతో పాటు వాహనాలకు కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప పూజలు చేశారు.

అనంతరం ఎస్పీ  జమ్మిచెట్టుకు కూడా పూజలు నిర్వహంచి ప్రదక్షణలు చేశారు....ఈ  కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ  రాధాక్రిష్ణ , ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.