రివర్స్ డిమాండ్: భార్య వెళ్లిపోయింది, ఒంటరి పురుషుడి పింఛను ఇవ్వండి

ఆసిఫాబాద్ లో విచిత్స సంఘటన చోటుచేసుకుంది. ఓ ఒంటరి భర్త విచితరమైన డిమాండ్  ను ప్రభుత్వం ముందుంచాడు. తనను భార్య వదిలేసిందని తెలియజేస్తూ ప్రభుత్వానికి ఓ వినతి అందించాడు. 

single husband wants to pension in asifabad

ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చినట్లే.. తనకూ పింఛన్ ఇవ్వాలని ఓ వ్యక్తి డిమాండ్ చేస్తున్నాడు. తన భార్య తొమ్మిదేళ్ల కిందటే తనను వదిలేసి పోయిందని.. కూలి పనులు చేసుకొని వృద్ధులైన తల్లిదండ్రులను పోషిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఒంటరి పురుషుడి పింఛన్ కావాలని కోరుతూ గ్రామ సర్పంచికి వినతిపత్రం సమర్పించాడు. ఈ ఆసక్తికర ఘటన కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

అసిఫాబాద్‌ జిల్లా బూరుగూడకి చెందిన ధరణి తిరుపతి తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య తన నుంచి తొమ్మిదేళ్ల కిందటే విడిపోయిందని.. నాటి నుంచి తాను ఒంటరినైపోయానని చెబుతున్నాడు. కూలి పనులు చేసుకుంటూ వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

read more  ఇంటర్ విద్యార్థినికి క్యాన్సర్: చికిత్సకు బాలకృష్ణ చేయూత

తన పేరు మీద భూమి గానీ, ఇతర ఆస్తులు గానీ ఏవీ లేవని తిరుపతి గోడు వెల్లబోసుకున్నాడు. ఒంటరి మహిళలకు నెల నెలా రూ.2016 ఆసరా పింఛన్ అందించినట్లే.. ఒంటరి పురుషుడినైన తనకూ పింఛన్ అందించాలని కోరుతున్నాడు. తన వినతి పత్రంపై స్పందించి ప్రభుత్వం తగిన సాయం చేయాలని కోరాడు.

తెలంగాణ ప్రభుత్వం.. ఒంటరి మహిళలకు నెల నెలా పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో రూ.1016 పింఛన్ ఇవ్వగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ సర్కార్ దీన్ని ఇటీవల రూ.2016కు పెంచింది. అయితే.. మహిళల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛన్‌ను తనకూ కావాలని ఓ పురుషుడు కోరడం చర్చనీయాంశంగా మారింది.

read more   నారాయణ కాలేజీ క్యాంపస్ లో మరో దారుణం.... విద్యార్థి ఆత్మహత్య

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios