Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో మధ్య విమోచన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీ సత్పలితాలనిస్తోందని..  దీనివల్ల మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఆంద్రప్రదేశ్ మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు.  

laxman reddy comments about ap liquar policy
Author
Guntur, First Published Dec 3, 2019, 9:03 PM IST

విజయవాడ: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ సత్పలితాలు ఇస్తోందని ఆంద్రప్రదేశ్ మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ షార్ట్ ఫిల్మ్స్, ప్రత్యేక పోస్టర్ల ద్వారా అవగాహన కలిగిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మద్యపాన నియంత్రణ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. 

గుంటూరు కేంద్రంగా మధ్య విమోచన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మణరెడ్డి ప్రకటించారు. మధ్యపాన నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్వాక్రా సంఘాలు, గ్రామ వాలంటీర్ల సహాయం తీసుకుంటామన్నారు.  

ఇప్పటికే మద్యానికి పూర్తిగా బానిపైన వారికి ఆ ఊబిలోంచి బయటకు తీసుకువచ్చేందుకు డి అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థి దశనుంచే మద్యం మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై ఒక పాఠం ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులకు కలవనున్నట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. 

read more  బార్ ల లైసెన్సుల రద్దు... ఏపి ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

గతేడాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ లో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు ప్రకటించింది. 2018 నవంబర్‌ లో 29లక్షల 62వేల కేసుల లిక్కర్ ను విక్రయించగా  ఈ ఏడాది నవంబర్‌లో 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే అమ్మినట్లు వెల్లడించారు. ఇలా 24.67 శాతం మేర మద్యం అమ్మకాల్లో తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. 

బీరు అమ్మకాలు 2018 నవంబర్‌ లో 17లక్షల 80వేల కేసులు అమ్మడుపోగా, ఈ ఏడాది అదే మాసంలో 8 లక్షల 13 వేల కేసులు మాత్రమే విక్రయించారు. దీంతో 54.30 శాతం బీర్ల అమ్మకాల తగ్గుదల నమోదైంది.

నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500 లకు తగ్గించారు. అటు బిజినెస్ సమయాన్ని ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పరిమితం చేశారు.

read more  అమ్మాయి కోసం... టిక్ టాక్ లో వీడియో చేసి యువకుడి ఆత్మహత్యాయత్నం

కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

గతంలో పర్మిట్ రూములతో కొన్నిచోట్ల, పర్మిట్ లు లేకుండా మరికొన్నిచోట్ల మద్యం సేవించేవారు. ఇప్పుడు పర్మిట్ రూములను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం  అమ్మకానికి మాత్రమే పరిమితమవుతున్నాయన్నారు. గ్రామాలలో కూడా బెల్ట్ షాపులను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో తొలగించడంతో గ్రామాలలో మద్యం వినియోగం భారీగా తగ్గింది.

 గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా నిఘా పెట్టడంతో గ్రామాలలో మద్యం తగ్గిందంటున్నారు.అయితే మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదు. భారీగా రేట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి ఆదాయం అలాగే వస్తోంది.  ఎలా చూసినా.. మద్యం వినియోగం మాత్రం తగ్గిందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios