రాష్ట్రంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభోత్సవ సభలో మహిళలకు జగనన్న వరాలు
సచివాలయాలతో గ్రామాల రూపురేఖల్లో పూర్తిగా మార్పు వస్తుందని, ప్రజలకు కావాల్సిన ప్రతి సేవా గ్రామ సచివాలయాల్లోనే అందుతుందని సీఎం జగన్ అన్నారు. ఏ అవసరానికి, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు.
విజయనగరం: రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయంలో ‘వైయస్సార్ విలేజ్ క్లినిక్’ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 11,158 వైయస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి రోజంతా వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన నర్సుతో పాటు ఒక ఏఎన్‌ఎం ఆ గ్రామంలోనే ఉండి వైద్య సేవలు అందిస్తారని... వారికి ఆ గ్రామంలోనే వసతి కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
సచివాలయాలతో గ్రామాల రూపురేఖల్లో పూర్తిగా మార్పు వస్తుందని, ప్రజలకు కావాల్సిన ప్రతి సేవా గ్రామ సచివాలయాల్లోనే అందుతుందని అన్నారు. ఏ అవసరానికి, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాల్లో మహిళా సంరక్షణలో పోలీస్‌లది ఎంతో కీలకపాత్ర అని పేర్కొన్నారు. అక్రమ మద్యం అమ్మకందారుల పట్ల వారు సింహస్వప్నం అని అభివర్ణించారు.
read more విజయనగరంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
రాష్ట్రంలో రెండవది అయిన దిశ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్ విజయనగరంలో ప్రారంభించారు. స్థానిక పోలీస్ బ్యారక్ గ్రౌండ్‌లో దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్రంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఉంది. విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా గ్రామ సచివాలయాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్‌లు, గ్రామ మహిళా సంరక్షక పోలీస్‌లు, రైతు భరోసా కేంద్రాల గురించి సీఎం మాట్లాడారు.
గ్రామాల రూపురేఖల్లో మార్పు
''రాబోయే రోజుల్లో ప్రతి 2వేల జనాభా ఉన్న ఒక గ్రామం ఎలా మారిపోతుంది అన్నది ఒక్కసారి ఊహించండి. ప్రజలకు కావాల్సిన ప్రతి సేవ అందుబాటులో ఉండే విధంగా గ్రామ సచివాలయం. ప్రతి 2 వేల జనాభాకు పూర్తిగా గ్రామం నుంచి బయటకు రావాల్సి అవసరమే లేకుండా గ్రామ సచివాలయం. ఏ సేవ అయినా కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమం. లంచాలకు తావు లేకుండా, డిస్క్రిమినేషన్‌కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి సేవ గ్రామ సచివాలయం ద్వారా అందుతుంది'' అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇంగ్లిష్ మీడియం
'‘గ్రామ సచివాలయం పక్కనే మనందరికి ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నాడు–నేడు అనే ఒక కార్యక్రమంతో స్కూల్ అంటే నిజంగా ఈ మాదిరిగా ఉండాలి, ప్రైవేటు స్కూల్స్‌కు మనం పోవాల్సిన అవసరం లేకుండా అంత కంటే మెరుగైన వసతులతో ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్ మన గ్రామంలోనే కనిపిస్తుంది. నాడు–నేడు అన్న కార్యక్రమంతో దానికి శ్రీకారం చుట్టాం. ఇంగ్లిష్ మీడియంలోకి కూడా మారుస్తున్నాం’' అని సీఎం గుర్తు చేశారు.
వైయస్సార్ విలేజ్ క్లినిక్
''ఆ తర్వాత అదే గ్రామంలో ఒక్క నాలుగు అడుగులు ముందుకు వేస్తే రాబోయే రోజుల్లో ‘‘వైయస్సార్ విలేజ్ క్లినిక్’’ అని డైరెక్ట్‌గా అక్కడే ఒక హాస్పిటల్ కూడా కనిపిస్తుంది. ఇంతకు ముందు రాష్ట్రం మొత్తం మీద 2400 సబ్ సెంటర్లు కూడా లేవు. కానీ మన ప్రభుత్వం, నా ఆలోచన ఎలా ఉంది అంటే.. మొత్తం ఎక్కడైతే 11,158 గ్రామ సచివాలయాలు ఉన్నాయో.. ప్రతి చోటా ఒక వైయస్సార్ విలేజ్ క్లినిక్ కూడా తీసుకురావాలని. అంటే ఒక బీఎస్సీ చదివిన నర్సు, మరో ఏఎన్‌ఎం.. ఇద్దరూ కూడా అదే ఊరిలో 24 గంటలు వైద్య సేవలు అందించే కార్యక్రమం. వాళ్లకు అకామడేషన్ కూడా అదే అదే ఊళ్లోనే’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెల్లడించారు.
read more భవిష్యత్ లో భారీ దాడులు... ఇదే నిదర్శనం...: వైసిపి ఎమ్మెల్యే ఆందోళన
రైతు భరోసా కేంద్రాలు
‘'ఆ విధంగా ఊరిలో నాలుగు అడుగులు ముందుకేస్తే.. వైయస్సార్ విలేజ్ క్లినిక్. మరో నాలుగు అడుగులు ఇటు వైపు వేస్తే ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్. నాలుగు అడుగులు ఇంకో వైపు వేస్తే గ్రామ సచివాలయం. మళ్లీ నాలుగు అడుగులు అటువైపు వేస్తే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం. అంటే రైతులకు సంబంధించి, ఆ 2 వేల జనాభాకు సంబంధించిన రైతులకు సంబంధించి అన్ని విషయాల్లోనూ వారికి తోడుగా ఉండే కార్యక్రమం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి ఈ–క్రాపింగ్ బుకింగ్ చేస్తారు.
రైతులకు బెస్ట్ వ్యవసాయ ప్రాక్టీసెస్ కింద అవగాహన కల్పిస్తారు. రైతులకు నాణ్యతతో కూడిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా చేసే విధంగా.. నాణ్యతకు సంబంధించి స్టాంప్ వేసి, గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి అమ్మే కార్యక్రమం చేస్తారు. రైతులకు ఆ గ్రామంలో ఏదైనా పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ కనీస గిట్టుబాటు ధర వచ్చే దాని కోసం రైతులకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చే కార్యక్రమం రైతు భరోసా కేంద్రం’'అని సీఎం వివరించారు.
ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు
'‘ఒక గ్రామం నుంచి ఒక మనిషి అవసరాల కోసం బయటకు పోవాల్సిన అవసరం లేకుండా, గ్రామంలో అన్నీ ఉండే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇటు వైపు తిరిగి చూస్తే రైతు భరోసా కేంద్రం. అటువైపు తిరిగి చూస్తే ఇంగ్లిష్ మీడియం స్కూల్. ఇటువైపు తిరిగి చూస్తే వైయస్సార్ విలేజ్ క్లినిక్. ఆ తర్వాత గ్రామ సెక్రటేరియట్’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మహిళా సంరక్షక పోలీస్
''ఈ గ్రామ సెక్రటేరియట్‌లో మరీ ముఖ్యంగా మహిళా సంరక్షక పోలీస్. మహిళా పోలీస్ మిత్ర. మీరు చేయాల్సిన పనులు.. మీ గ్రామంలో ఎక్కడైనా, ఎవరైనా కూడా ఇల్లీగల్, ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఎవరైనా అమ్ముతా ఉంటే వారికి సింహస్వప్నం మన మహిళా సంరక్షక పోలీస్. ఒక్క మెసేజ్ మీరు కొట్టేస్తే చాలు.. వెంటనే ఎస్పీ అలర్ట్ అవుతారు. వెంటనే పోలీసులు మీ గ్రామంలోకి వస్తారు.. ఎవరైనా మీ గ్రామంలో ఇల్లీగల్‌గా లిక్కర్ అమ్ముతా ఉంటే, ఎవరైనా ఇల్లిసిట్ లిక్కర్ కానీ కిరాణ కొట్టులో పెట్టి అమ్ముతా ఉంటే, మన పిల్లలను లిక్కర్‌కు బానిస చేసే కార్యక్రమం ఏదైనా చేస్తా ఉంటే, ఒక్క ఫోన్ కొడితే చాలు. ఒక ఎస్సెమ్మెస్ కొడితే చాలు. వెంటనే పోలీసులు వస్తారు. విలేజ్‌ను క్లీన్ చేసేస్తారు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ విధంగా విలేజ్ లెవెల్‌లో ఒక అవేర్‌నెస్ తీసుకురావడం. విలేజ్ లెవెల్‌లోకి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకువచ్చే కార్యక్రమం తమ ప్రభుత్వం చేస్తోందని సీఎం తెలిపారు.
ఇంకా..
''గ్రామాల్లో గ్రామ సచివాలయాలది చాలా పెద్ద బాధ్యత అని, ఊళ్లో ప్రతి విషయంతో పాటు, అంగన్‌వాడీ కేంద్రాలు వారి అధీనంలోనే ఉంటాయని, గ్రామంలో ఉన్న స్కూళ్లు, ఆ స్కూళ్లలో వ్యవహారాలు, ఆ స్కూళ్లలో బాత్‌రూమ్‌ల దగ్గర నుంచి, ఆ స్కూళ్లో మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ దాకా.. అన్ని కూడా గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పూర్తిగా మానిటరింగ్, సూపర్‌వైజింగ్ చేయడమే కాకుండా, ప్రతిదీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ గ్రామంలో ఇంప్లిమెంట్ అయ్యే కార్యక్రమం ఇది'' అని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.