అమరావతి: మహిళలను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ గుండాలు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంమని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు. కేవలం ఉనికిని కాపాడుకోవటానికే టిడిపి ఇటువంటి సంఘటనలకు పాల్పడుతోందన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇలాంటి దాడులు జరుగుతాయని... అందుకు ఇదే నిదర్శనంగా భావిస్తున్నామన్నారు. 

అమరావతిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తమ వారి భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే టిడిపి నాయకులు రాజధాని పేరుతో దీక్షలు చేస్తున్నారని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు వసూళ్ళు చేసి ఉద్యమాలు నడుపుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. 

read more ఒక్క సంతకానికే అరకోటి... దేవాదాయ మంత్రి ఇలాకాలో తమ్మినేని...: మాజీ విప్ కామెంట్స్

అమరావతి నిరసనల పేరుతో చేపడుతున్న ర్యాలీలలో పాల్గొన్న ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, టిడిపి రాజధాని ప్రాంత దళితులను ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలుసన్నారు. టిడిపి నడిపించే ఉద్యమం ఒక కృత్రిమ ఉద్యమమని రోశయ్య ఆరోపించారు. 

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం టిడిపి చేస్తోందన్నారు. తెలుగుదేశం శ్రేణులు, ఎల్లో మీడియా రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాభివృద్ధి కొరకు నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. 

read more  ''జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ''...అలాగయితేనే జగన్ ఈగో చల్లబడుతుంది...: వంగలపూడి అనిత

రాష్ట్రాభివృద్ది కుంటు పడాలని టిడిపి  నాయకులు కోరుకుంటున్నారని... దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్నారు. తమ  ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణ, విడదల రజినీ, నందిగామ సురేష్ లపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగాపేర్కొన్నారు.  ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని... వైసీపీ కార్యకర్తలు అందరూ తిరగబడితే ఏం అవుతారో ఆలోచించుకోండని  రోశయ్య హెచ్చరించారు.