సారాంశం

లక్నోలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే కోరికే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరదలితో వివాహేతర సంబంధం: కామవాంఛ ముందు బంధాల విలువలు చెరిగిపోతే, దాని పర్యవసానం తరచుగా భయంకరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను కేవలం తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే కోరికతో చంపేశాడు.పోలీసుల కథనం ప్రకారం, మృతురాలు సవిత తన భర్త సంజయ్‌తో కలిసి మొహద్దీన్‌పూర్ గ్రామంలో నివసిస్తుంది. సోమవారం సాయంత్రం పూర్ణ్‌పూర్ గ్రామం సమీపంలోని కిసాన్ పథ్ వద్ద ఓ మహిళ మృతదేహం కనిపించడంతో ప్రజలు పోలీసులకు తెలియజేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో  సవిత భర్తే ఆమెను చంపేసినట్లు నిర్థారించారు.విచారణలో సంజయ్ తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనుకున్నట్లు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య సవిత అభ్యంతరం వ్యక్తం చేసింది. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో సంజయ్ సవితను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.సోమవారం సంజయ్ సవితకి మందులు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి, గోసాయిగంజ్‌లోని ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా పూర్ణ్‌పూర్ గ్రామం సమీపంలో సవిత తలపై రాయితో కొట్టి, చీరతో గొంతు బిగించి చంపేశాడు. ఆా తర్వాత సంజయ్ సవిత మృతదేహాన్ని 20 అడుగుల లోయలో పడేశాడు. పోలీసులు నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అక్కడ రక్తపు మరకలున్న రాయి కూడా లభించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

తాంత్రికుడి పాత్రపైనా దర్యాప్తు

సంజయ్ తన భార్యను తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లానని కూడా ఒప్పుకున్నాడు. ఈ దారుణ విషయంలో తాంత్రికుడి పాత్ర ఏమిటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాంత్రికుడి ప్రమేయం ఉంటే అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.మృతురాలు సవిత తండ్రి రామ్‌నరేష్ ఈ కేసులో సంజయ్‌తో పాటు అతని సోదరుడు అజయ్, తల్లిదండ్రులపై కూడా ఈ విషయం గురించి ఆరోపణలు చేశాడు. పోలీసులు వీరందరినీ విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.