ప్రపంచ కప్ ట్రోపీయే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆసిస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో గాయపడ్డ ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా కోలుకోలేదు. దీంతో శనివారం అప్ఘానిస్తాన్ తో తలపడనున్న మొదటి మ్యాచ్ కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆసిస్ కు ఊహించలేని దెబ్బే అని  చెప్పాలి. 

అప్ఘాన్ తో మ్యాచ్ కోసం జరిపిన ఫిట్ నెస్ పరీక్షలో వార్నర్ విఫలమయ్యాడు.  దీంతో అతడిని పక్కనపెట్టడం తప్ప  ఆసిస్ జట్టు మేనేజ్ మెంట్ మరో మార్గం లేకుండా పోయింది. అయితే గాయంతో బాధపడుతున్న వార్నర్ కేవలం ఈ మ్యాచ్ కు  మాత్రమే దూరమయ్యే అవకాశాలున్నాయని...తదుపరి అన్ని మ్యాచులకు అతడు అందుబాటులోకి వస్తాడని ఆసిస్ చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు.   

బాల్ ట్యాంపరింగ్ వివాదం, ఏడాది నిషేదం తర్వాత ఆసిస్ తరపున వార్నర్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. ఐపిఎల్ లో పునరాగమనం  చేసి అదరగొట్టి టాప్ స్కోరర్ గా నిలిచిన అతడు ప్రపంచ కప్ లోనూ రాణిస్తాడని అందరూ భావించాడు. అతడు కూడా అదే కసితో వున్నాడు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా అతడికి గాయం కావడంతో మొదటి  మ్యాచ్ కు దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో ఏడాది  తర్వాత వార్నర్ విద్వంసకర బ్యాటింగ్ ను చూడాలనుకున్న ఆసిస్ అభిమానులకు నిరాశ తప్పడం లేదు. 

అయితే ఈ ఒక్క మ్యాచ్ కు వార్నర్ దూరమైతే పరవాలేదు కానీ మిగతా మ్యాచులకు కూడా దూరమైతే ఆసిస్ జట్టుపై తీవ్ర ప్రభావం పడనుంది. ఓపెనర్ గా అద్భుతాలు చేయగల సత్తా వున్న అతడు ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీ సాధించాలంటే ఆసిస్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాడు. అలాంటి కీలక ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరమైతే ఆసిస్ ప్రపంచ కప్ సాధించాలనే ఆశ అంత ఈజీగా నెరవేరే అవకాశం వుండదు. కాబట్టి జట్టు సభ్యులతో పాటు ఆస్ట్రేలియా అభిమానులు వార్నర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ