Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: పాక్ సెమీస్ ఆశలు సజీవం...సౌతాఫ్రికాపై ఘన విజయం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ మరో కీలక సమరానికి సిద్దమయ్యింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసి సొంత అభిమానుల నుండే  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఇవాళ(ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఎలాగైనా సఫారి జట్టుపై గెలిచి సెమి ఫైనల్ ఆవకాశాలను సజీవంగా  వుంచుకోవడంతో పాటు అభిమానుల కోపాన్ని కాస్తయినా తగ్గించాలని పాక్ భావిస్తోంది. 

world cup 2019: pakistan vs south  africa match updates
Author
Lord's Cricket Ground, First Published Jun 23, 2019, 2:49 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఘన విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా వుంచుకుంది. 309 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 259 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో పాక్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

పాకిస్థాన్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా టపటపాా  వికెట్లు కోల్పోతోంది. మొర్రిస్ (16 పరుగులు) ఏడో వికెట్ రూపంలో రియాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ వెంటనే రబడ(3 పరుగులు) కూడా  అతడి బౌలింగ్ లోనే ఔటయ్యాడు. దీంతో 239మ పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. 

సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. డుస్సెన్(36 పరుగులు), మిల్లర్ (31 పరుగుల) లు మంచి  భాగస్వామ్యాన్ని నెలకొల్పి  వెంటవెంటనే ఔటవడంతో సౌతాఫ్రికా కష్టాల్లోకి జారుకుంది. దీంతో 192 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 

సౌతాఫ్రికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ డుప్లెసిస్ (63 పరుగులు)  ను మహ్మద్ అమీర్ ఔట్ చేశాడు. దీంతో 136 పరుగుల వద్ద సఫారీ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 

సౌతాఫ్రికాా 103 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి షాదన్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంతకుముందు డికాక్ కూడా 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాదాన్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

309 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టును పాక్ ఆదిలోనే దెబ్బతీసింది. మహ్మద్ అమీర్ బౌలింగ్ ను బంతిని డిపెన్స్ ఆడేందుకు ప్రయత్నించిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(2 పరుగులు) వికెట్ల  ముందు  అడ్డంగా దొరికిపోయాడు. ఇలా కేవలం నాలుగు పరుగుల వద్దే సౌతాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది.  

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ టాపార్డర్ బ్యాట్ మెన్స్ అదరగొట్టారు. ఓపెనర్లతో సహా బ్యాట్ మెన్స్ అందరూ వ్యక్తిగతంగా భారీ స్కోర్లు చేయకున్నా తలా కొన్ని పరుగులు చేయడంతో పాక్ 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే మిడిల్ ఓవర్లలో హారిస్ సోహైల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 59 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు.

ఇక పాక్ ఓపెనర్లు ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ లతో 44 పరుగులు చేసి తాహిర్ బౌలింగ్ లోనే ఔటయ్యారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ(69 పరుగులు) సాధించాడు. ఇక హఫీజ్ 20, వసీమ్ 23 పరుగులతో పరవాలేదనిపించారు. దీంతో పాక్ సఫారీ జట్టు ముందు మంచి టోటల్ వుంచగలిగింది. ఇక సౌతాఫ్రికా బౌలర్ల విషయానికి వస్తే ఎంగిడి 3, ఇమ్రాన్ తాహిర్ 2, మార్క్రమ్, ఫెహ్లుక్వామో చెరో వికెట్ తీశారు. 

దక్షిణాఫ్రికా బౌలర్ ఎంగిడి బౌలింగ్ లో పాక్ ఆటగాడు ఇమద్ వసీమ్( 23 పరుగులు) ఔటయ్యాడు. దీంతో పాక్ 295 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అయితే మరోవైపు హారిస్ సోహైల్ దాటిగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీకి  చేరువలో నిలిచాడు. 

హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న పాక్ బ్యాట్ మెన్ బాబర్ ఆజమ్(69 పరుగులు) ఔటయ్యాడు. ఫెహ్లుక్వాయయో బౌలింగ్ లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పాక్ 224 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 

నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతున్న సమయంలో పాక్ మూడో వికెట్ కోల్పోయింది. 143 పరుగుల వద్ద మహ్మద్ హఫీజ్(20 పరుగులు)ను మార్క్రమ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

పాకిస్థాన్ మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కూడా పెవిలియన్ కు చేరాడు.  అతడు సేమ్ ఫకార్ జమాన్ మాదిరిగానే 44 పరుగుల  వ్యక్తిగత స్కోరు వద్ద అదే తాహిర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.దీంతో పాక్ 98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

పాకిస్థాన్ 81 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫకార్ జమాన్ (44 పరుగులు) హాఫ్ సెంచరీకి  చేరువలో ఔటయ్యాడు. ఇమ్రార్ తాహార్  బౌలింగ్ లో హషీమ్ ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి ఫకార్ పెవిలియన్ కు చేరాడు. దీంతో పాక్ 81 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ మరో కీలక సమరానికి సిద్దమయ్యింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసి సొంత అభిమానుల నుండే  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఇవాళ(ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఎలాగైనా సఫారి జట్టుపై గెలిచి సెమి ఫైనల్ ఆవకాశాలను సజీవంగా  వుంచుకోవడంతో పాటు అభిమానుల కోపాన్ని కాస్తయినా తగ్గించాలని పాక్ భావిస్తోంది. 

ఇదే సమయంలో సౌతాఫ్రికా కూడా పాక్ పై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే దాదాపు సెమీస్ అవకాశాలు కోల్పోయిన సఫారీ జట్టు ఓటములతో ఆరంభించిన ప్రపంచ కప్ ను విజయాలతో ముగించుకోవాలని చూస్తోంది.అంతేకాకుండా ఎంగిడి  వంటి కీలక బౌలర్ కూడా జట్టులోకి రావడం ఆ జట్టుకు మరింత బలాన్ని ఇస్తోంది.  

మొత్తానికి మరికొద్దిసేపట్లో లార్డ్ మైదానంలో పాక్-సౌతాఫ్రికా ల  పోరు మొదలవనుంది. ఇందుకోసం నిర్వహించని టాస్ ను పాక్ గెలిచింది. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా  మొదట బ్యాటింగ్ కు దిగాల్సి వస్తోంది.  

పాకిస్థాన్ జట్టులో రెండు మార్పులు చేసినట్లు సర్ఫరాజ్ వెల్లడించాడు.. షోయబ్ మాలిక్, హసన్ అలీలు తుది జట్టులో చోటు కోల్పోగా హారిస్ సోహైల్, షాహీన్ లు చోటు దక్కించుకున్నారు. సఫారీ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

తుది జట్లు;

పాకిస్థాన్ టీం;

1. ఇమామ్ ఉల్ హక్

2. ఫకార్ జామాన్

3. బాబర్ ఆజామ్

4. మహ్మద్ హాఫీజ్

5. సర్ఫరాజ్ అహ్మద్

6.  హారిస్ సోహైల్

7. ఇమాద్ వాసిమ్

8. షాదాబ్ ఖాన్

9.  షాహీన్

10. వాహబ్ రియాజ్

11. మహమ్మద్ అమీర్

దక్షిణాఫ్రికా టీం: 

1. హషీమ్ ఆమ్లా

2. క్వింటన్ డికాక్(వికెట్ కీపర్)

3. మార్క్రమ్

4. ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)

5. వాండర్ డుస్సెన్

6. డేవిడ్ మిల్లర్

7. ఫెహ్లుక్వాయో

8. క్రిస్ మొర్రిస్

9. కగిసో రబడ

10. లుంగి ఎంగిడి

11. ఇమ్రాన్ తాహిర్ 

మరిన్ని వార్తలు

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల 

Follow Us:
Download App:
  • android
  • ios