ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ 2019 లోొ విశ్వవిజేతగా ఓ నూతన జట్టు నిలవనుంది. ఇవాళ(గురువారం) ఆస్ట్రేలియాతో జరిగిన  సెమీఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు  అలవోకగా గెలిచింది.  మొదట బౌలింగ్ ఆ తర్వాత చేజింగ్ లో అదరగొట్టిన మోర్గాన్ సేన డిపెండింగ్ ఛాపింయన్ ను చిత్తుచేసింది. దీంతో న్యూజొిలాండ్ తో ఫైనల్లో తలపడే అవకాశాన్ని కొట్టేసింది. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా మొదటిసారి ప్రపంచకప్ ను సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది.   

ఆతిథ్య  ఇంగ్లాండ్-ఆసిస్ ల మద్య జరిగిన రెండో సెమీఫైనల్ బర్మింగ్ హామ్ వేదికగా జరిగింది. అయితే మ్యాచ్ ఆరంభం నుండి ఆసిస్ పై ఇంగ్లీష్ జట్టు ఆధిక్యమే కొనసాగింది. మొదట కంగారు జట్టును బౌలింగ్ తో కంగారెత్తించిన ఇంగ్లీష్ బౌలర్లు కేవలం 223 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిగా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ హవా కొనసాగింది. ఓపెనర్లు జేసర్ రాయ్(84 పరుగులు), బెయిర్ స్టో(34 పరుగులు) లు కలిసి 17  ఓవర్లలోనే 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతోనే ఆజట్టు సగం విజయం సాధించింది.

వీరిద్దరు ఔటయ్యాక కూడా ఇంగ్లాండ్ జోరే కొనసాగింది. రూట్(49 పరుగులు), కెప్టెన్ మోర్గాన్ (45 పరుగులు) లు మరో వికెట్  పడకుండా చివరివరకు నిలిచి కేవలం 32.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేశారు. దీంతో ఇంగ్లాండ్ ఫైనల్ కు అర్హత సాధిచింది.

  ఇంగ్లాండ్ బౌలర్ల జోరుముందు ఆస్ట్రేలియా జట్టు నివలేకపోయింది. కేవలం స్టీవ్ స్మిత్(85 పరుగులు) ఒక్కడే ఒంటరిపోరాటం చేయడంతో ఆ జట్టు కనీసం 223 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మిగతావాళ్లలో క్యారీ 46, స్టార్క్ 29, మ్యాక్స్ వెల్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.  

ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, రషీద్ లు మూడేసి వికెట్లు పడగొట్టి ఆసిస్ నడ్డి విరిచారు. ఇక ఆర్చర్ 2, మార్క్ వుడ్ 1 వికెట్ పడగొట్టాడు. విరామంలేకుండా వెంటవెంటనే వికెట్లు పడగొట్టడంతో ఆసిస్ 223 పరుగులకు పరిమితమయ్యింది. 

పరుగుల వేగాన్ని పెంచాల్సిన సమయంలో స్మిత్ రనౌటయ్యాడు. 85 పరుగులు చేసిన అతడు  అనవసర పరుగుకు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 217 పరుగుల వద్ద ఆసిస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే స్టార్క్ కూడా ఔటయ్యాడు. దీంతో ఆసిస్ అతి కష్టంమీద 223 పరుగులు చేయగలిగింది.  

 ఈ మ్యాచ్ లో ఆర్చర్ వేసిన బౌన్స్ తో తీవ్రంగా గాయపడి కూడా బ్యాటింగ్ కొనసాగించిన అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. 46 పరుగులు చేసిన అతడు హాఫ్ సెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే అదే ఓవర్లో స్టోయినీస్ కూడా ఎల్బీడబ్ల్యూగా డకౌటయ్యాడు.  

 ఆతిథ్య జట్టు బౌలర్ల  ధాటికి ఆస్ట్రేలియా  ఓపెనర్లిద్దరు కేవలం 10 పరుగులకే  పెవిలియయన్ కు చేరారు.మొదట కెప్టెన్ కమ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ను ఆర్చర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ వార్నర్(9 పరుగులు) ను వోక్స్ పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో తక్కువ పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయి ఆసిస్ కష్టాలను కొనితెచ్చుకుంది.

ప్రపంచ కప్ టోర్నీలో రెండో సెమీఫైనల్ బర్మింగ్ హామ్ స్టేడియం సిద్దమయ్యింది. ఆతిథ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు పోరుకు అర్హత సాధించేందుకుఈ మ్యాచ్ లో పోటీపడ్డాయి. ఇప్పటికే మొదటి సెమీఫైనల్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. రెండో సెమీఫైనల్లో ఆసిస్ ను చిత్తుచేసిన  ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఇక టైటిల్ పోరులో కివీస్ తో తలపడనుంది. 

కీలకమైన ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. దీంతో కెప్టెన్ ఆరోన్ ఫించ్ మొదట బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలింగ్ చేసి  ఆ తర్వాత చేజింగ్ కు దిగింది. 

తుది జట్లు:

ఇంగ్లాండ్:

జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, లియామ్ ఫ్లంకెట్, ఆదిల్ రషీద్,  జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్

ఆస్ట్రేలియా టీం:  

ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్ కోబ్, మార్కస్ స్టోయినీస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్),  పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్,  బెహ్రెండార్ఫ్