Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: షమీ హ్యాట్రిక్ మాయాజాలం... ఉత్కంఠ పోరులో భారత్ దే విజయం

పసికూన అప్ఘానిస్థాన్ ప్రపంచ కప్  హాట్ ఫేవరెట్ టీమిండియాను బెంబేలెత్తించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ అదరగొట్టి టీమిండియా ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించి దాదాపు గెలిచినంత పనిచేసింది. అయితే చివరి ఓవర్లో భారత బౌలర్ మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసి అదరగొట్టడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే అప్ఘానిస్తాన్ పై కూడా ఇలా చెమటోడ్చి గెలవాల్సి రావడం కాస్త ఆందోళనను కలిగిస్తోంది. 

world cup 2019:  india vs afghanistan match updates
Author
Southampton, First Published Jun 22, 2019, 2:51 PM IST

పసికూన అప్ఘానిస్థాన్ ప్రపంచ కప్  హాట్ ఫేవరెట్ టీమిండియాను బెంబేలెత్తించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ అదరగొట్టి టీమిండియా ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించి దాదాపు గెలిచినంత పనిచేసింది. అయితే చివరి ఓవర్లో భారత బౌలర్ మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసి అదరగొట్టడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే అప్ఘానిస్తాన్ పై కూడా ఇలా చెమటోడ్చి గెలవాల్సి రావడం కాస్త ఆందోళనను కలిగిస్తోంది. 

225 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘాన్ వీరోచితంగా పోరాడింది. ఆరంభంలోనే హజ్రతుల్లా వికట్ కోల్పోయినా ఏమాత్ర ఒత్తిడికి లోనవకుడా నిలకడగా బ్యాటింగ్ చేసింది. ఇలా కెప్టెన్ నయిబ్(27 పరుగులు), రహ్మత్ షా(36 పరుగులు) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే హష్మతుల్లా షాహిది కూడా 21 పరుగులతో రాణించాడు. అయితే నబి(52 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే చివరి ఓవర్లో ముగ్గురు బ్యాట్ మెన్స్ వెంటవెంటనే ఔటవడంతో అప్ఘాన్ ఓటమి తప్పలేదు. 11 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 

టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లతో ఆదరగొట్టాడు. ఇక బుమ్రా 2, చాహల్ 2, పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 

 బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టుపై అఫ్ఘాన్ బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. మ్యాచ్ ఆరంభం నుండి విరామం లేకుండా టీమిండియా వికెట్లను పడగొడుతూ అప్ఘాన్ అదరగొట్టింది. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  కేవలం 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

టీమిండియా బ్యాట్ మెన్స్ లో కోహ్లీ(67 పరుగులు), కేదార్ జాదవ్ (52 పరుగులు) లు మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు. రాహుల్ 30, విజయ్ శంకర్ 29, ధోని 28 మినహాయిస్తే మిగతా ఆటగాళ్లెవరూ కనీసం డబుల్ డిజిట్ స్కోరును కూడా సాధించలేకపోయారు. దీంతో భారత జట్టు ఇంత తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సి వచ్చింది.

 అప్ఘాన్ బౌలర్లలో గుల్బదిన్ నయబ్, నబిలు రెండేసి వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్, రహ్మత్ షా, అఫ్తాబ్ ఆలమ్, రహ్మాన్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా బౌలర్లందరు సమిష్టిగా రాణించి  తక్కువ పరుగులిచ్చి వికెట్లు పడగొట్టడంతో టీమిండియాపై అప్ఘాన్ పైచేయి సాధించగలిగింది. 

 టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విద్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం(1 పరుగు) 7 పరుగుల స్కోరు వద్దే ఔటయ్యాడు.అప్ఘాన్ బౌలర్ రహ్మాన్ ఓ అద్భుతమైన బంతితో రోహిత్ ను బోల్తా కొట్టించి బంతి గాల్లోకి లేచేలా చేశాడు. దీంతో ఆ  బంతిని ముజీబ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.  

ప్రపంచ కప్ టోర్నీలో మరో సమరానికి టీమిండియా సిద్దమైంది. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ వేదికన అప్ఘానిస్తాన్ తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం నిర్వహించిన టాస్ ను గెలుచుకున్న కోహ్లీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో అప్ఘాన్ మొదట ఫీల్డింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ కు దిగింది. 

అయితే ఈమ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో గాయపడ్డ ఫేసర్ భువనేశ్వర్ స్థానంలో మహ్మద్ సమీ జట్టులోకి వచ్చాడు. విజయ్ శంకర్ గాయపడ్డప్పటికి ప్రస్తుతం ఫిట్ గానే వున్నాడని...అందువల్ల అతడు యధావిధిగా జట్టులో కొనసాగుతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు.  

అప్ఘాన్ జట్టులో కూడా రెండు మార్పులు చోటుచేసుకున్నట్లు  కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ వెల్లడించాడు. నూర్ అలా జద్రాన్, దవ్లత్ జద్రాన్ స్థానంలో హజ్రతుల్లా, అఫ్తాబ్ జట్టులో చేరినట్లు వెల్లడించాడు. 

తుది జట్లు;

టీమిండియా;

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్,  మహ్మద్ షమీ, జయువేందర్ చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా

అప్ఘాన్ టీం:

హజ్రతుల్లా, గుల్బదిన్ నయిబ్(కెప్టెన్),  రహ్మత్ షా,, హష్మతుల్లా షాహిది, అస్ఘార్ అప్ఘాన్, మహ్మద్ నబి, నజీబుల్ల జద్రాన్, ఇక్రమ్ అలిఖిల్(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, అఫ్తాబ్ ఆలమ్, ముజీబ్ ఉర్ రహ్మాన్ 

మరిన్ని వార్తలు

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల 

Follow Us:
Download App:
  • android
  • ios