Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్: ఉత్కంఠ పోరులో అప్ఘాన్ కు తప్పని ఓటమి... పాక్ సెమీస్ ఆశలు సజీవం

ప్రపంచ కప్  టోర్నీలో సెమీస్ ఆశలను సజీవంగా వుంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో అప్ఘాన్ ఓడినా అభిమానుల మనసులను గెలుచుకుంది. కేవలం 228 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాక్ జట్టును అప్ఘాన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టి దాదాపు ఓడించినంత పని చేశారు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి పాక్ లక్ష్యాన్ని ఛేదించిందంటే మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థమవుతుంది.

icc world cup 2019: pakistan vs afghanistan match updates
Author
Leeds, First Published Jun 29, 2019, 2:52 PM IST

ప్రపంచ కప్  టోర్నీలో సెమీస్ ఆశలను సజీవంగా వుంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో అప్ఘాన్ ఓడినా అభిమానుల మనసులను గెలుచుకుంది. కేవలం 228 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాక్ జట్టును అప్ఘాన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టి దాదాపు ఓడించినంత పని చేశారు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి పాక్ లక్ష్యాన్ని ఛేదించిందంటే మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థమవుతుంది.

పాక్ బ్యాట్ మెన్స్ ఒక్కరు కూడా కనీసం అర్థశతకాన్ని సాధించలేకపోయారు. అయితే బాబర్ ఆజమ్ 45, ఇమాద్ వసీం 49(నాటౌట్), ఇమామ్ 36 పరుగులతో రాణించారు.అయితే మిగతా ఆటగాళ్ళు ఎవరూ రాణించకపోవడంతో పాక్ చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. అప్ఘాన్ బౌలర్లలో రహ్మాన్ 2, నబి 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. 

కీలక సమయంలో పాక్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ రనౌటయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో పాక్ 156 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది.

పాకిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. గతంలో పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో మంచి స్కోరు చేసి ఆకట్టుకున్న హరీస్ సోహైల్ అప్ఘాన్ పై మాత్రం చేతులెత్తేశాడు. స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ కు సోహైల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో పాక్ కేవలం 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 

228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ను అప్ఘాన్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. వంద పరుగుల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయిన పాక్ ను రహ్మాన్ మరో దెబ్బ తీశాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హఫీజ్ ను ఔట్ చేసి నాలుగో వికెట్ పడగొట్టాడు. దీంతో పాక్ 121 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

గత మ్యాచ్ లో సెంచరీతో ఆకట్టుకున్న బాబర్ ఆజమ్ ను అప్ఘాన్ బౌలర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు. అతడు 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 81 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. 

 228 పరుగుల విజయలక్ష్యంతో  బరిలోకి దిగిన పాకిస్థాన్ కు అఫ్ఘాన్ షాకిచ్చింది. ఓపెనర్ ఫకార్ జమాన్ మొదటి ఓవర్ రెండో బంతికే డకౌటయ్యాడు. దీంతో పాక్ పరుగుల ఖాతా తెరవక ముందే  మొదటి వికెట్ కోల్పోగా 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.  ఇమామ్ ఉల్ హక్(36 పరుగులు) ను మహ్మద్ నబి ఔట్ చేశాడు. 

పాకిస్థాన్ బౌలర్ల ధాటికి అఫ్ఘాన్ జట్టు నిలవవలేకపోయింది. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రిది ఆరంభంలోనే అప్ఘాన్ టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

అప్ఘాన్ ఆటగాళ్లలో అస్ఘర్ అప్ఘాన్(42 పరుగులు), నజీబుల్లా జద్రాన్(42 పరుగులు), రహ్మత్ షా(35 పరుగులు) టాప్ స్కోరర్లు. మిగతా బ్యాట్ మెన్స్ ఎవరూ రాణించలేకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది.

పాక్ బౌలర్లలో షాహిన్ షా  అఫ్రిది 10 ఓవర్లపాటు బౌలింగ్ చేసి 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇమద్ వసీం 2, వాహబ్ రియాజ్ 2, షాదన్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.  

 ఓవైపు వికెట్లు పడుతున్నా బెదరకుండా ఒంటరిపోరాటం చేసిన నజీబుల్లా జద్రాన్ కూడా ఔటయ్యాడు.  ధాటిగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ వైపు దూసుకుపోతున్న సమయంలో అతన్ని అఫ్రిది ఔట్ చేశాడు. దీంతో 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నజీబుల్లా ఇన్నింగ్స్ ముగిసింది. 

అప్ఘాన్ బ్యాట్ మెన్స్ తడబాటు కొనసాగుతోంది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు నబి కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వాహబ్ రియాజ్ బౌలింగ్ లో అతడు ఔటయ్యాడు. 

అప్ఘాన్ 125 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలిఖిల్(24పరుగులు) ను ఇమద్ వసీం ఔట్ చేశాడు. ఇలా తక్కువ పరుగలకే అప్ఘాన్ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. 

ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కబెడుతున్న అస్గాన్ అఫ్ఘాన్(42 పరుగులు 35 బంతుల్లో) ఔటయ్యాడు. షాదన్ ఖాన్  అతన్ని పెవిలియన్ కు పంపించాడు. దీంతో అప్ఘాన్ 121 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 

పాక్ బౌలర్ల ధాటికి అప్ఘాన్ బ్యాట్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకున్న ఆ జట్టు మూడో వికెట్ కూడా చేజార్చుకుంది. 35 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ రహ్మత్ షా ను వసీం ఔట్ చేశాడు. దీంతో అప్ఘాన్ 57 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 

పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది అప్ఘాన్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు.  వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట కెప్టెన్ గుల్బదిన్ ను పెవిలియన్ కు పంపించ అఫ్రిది ఆ తర్వాత బంతికే షాహిదిని డకౌట్ చేశాడు. అయితే అతడి హ్యాట్రిక్ ప్రయత్నాన్ని ఇక్రమ్ అడ్డుకున్నాడు. దీంతో అప్ఘాన్ 27  పరుగులకే రెండు వికెట్లు  కోల్పోయింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘాన్ కు ఆదిలోనే షాక్ తగిలింది.కెప్టెన్ గుల్బదిన్ నయిబ్(15 పరుగులు) అఫ్రిది బౌలింగ్ లో ఔటయ్యాడు.  దీంతో అఫ్ఘాన్ 27 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.  

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికు దాదాపుగా  మూడు జట్లు సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకోగా నాలుగో స్థానం కోసం దాదాపు  మరో మూడు జట్లు తలపడుతున్నాయి. ఇలా సెమీఫైనల్ ఆడే అవకాశం కోసం పోరాడుతున్న పాకిస్థాన్ ఇవాళ(శనివారం) అప్ఘానిస్తాన్ తో తలపడింది.

లీడ్స్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను అప్ఘాన్ గెలుచుకుంది. దీతో గుల్బదిన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి పాక్ మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత చేజింగ్ చేయాల్సి వుంటుంది. 

టాస్ అనంతరం అప్ఘాన్ కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ మాట్లాడుతూ... పాకిస్థాన్ చాలా బలమైన జట్టని అన్నాడు. కానీ అలాంటి జట్టును తాము వార్మప్ మ్యాచ్ లో ఓడించామని...అదే మాకు కొండంత బలాన్ని ఇస్తోందన్నాడు. ఈ మ్యాచ్ లోనూ వార్మఫ్ మ్యాచ్ పలితాన్నే రాబట్టడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. దవ్లత్ స్థానంలో హమిద్ జట్టులోకి వచ్చినట్లు  గుల్బదిన్ వెల్లడించాడు. 

ఇక పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ మాట్లాడుతూ...టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవారమన్నాడు. వాహబ్ కొంచెం  ఇబ్బందిపడుతున్నా ప్రస్తుతం అతడు బాగానే వున్నాడని... ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు తెలిపాడు. కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్లు సర్ఫరాజ్ తెలిపాడు.

తుది జట్లు:

అఫ్ఘాన్ టీం: 

గుల్బదిన్ నయిబ్(కెప్టెన్), రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, అస్ఘాన్ అప్ఘాన్, షమీవుల్లా శిన్వారి, మహ్మద్ నబి, నజీబుల్లా జద్రాన్, ఇక్రమ్ అలిఖిల్(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, హమిద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ 

పాకిస్థాన్ టీం:

ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్, మహ్మద్ హఫీజ్, హారిస్ సోహైల్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్, వికెట్ కీపర్), ఇమద్ వసీం, షాదన్ ఖాన్, మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్, షాహీన్ అఫ్రిది

  

 మరిన్ని వార్తలు

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల 

Follow Us:
Download App:
  • android
  • ios