జైస్వాల్-గిల్‌ల సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ

IND vs ZIM 4th T20 Match Highlights : నాలుగో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించి భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
 

Yashasvi Jaiswal-Shubman Gill's Tsunami innings, Team India's super victory over Zimbabwe in the 4th T20 RMA

IND vs ZIM 4th T20 Match Highlights :  జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త జ‌ట్టు జోరు కొన‌సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఓడిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో జింబాబ్వేను చిత్తుగా ఓడించి సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. యశస్వి జైస్వాల్ సునామీ బ్యాటింగ్ తో 4వ టీ20 మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే బ్యాటింగ్ దిగి 152 పరుగులు చేసింది. జింబాబ్వే ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించగా, మిడిలార్డర్ విఫ‌లం కావ‌డంతో భారీ స్కోర్ చేయ‌లేక‌పోయింది. 153 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన టీమిండియాకు ఓపెన‌ర్లు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ అద‌ర‌గొట్టారు. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (93 పరుగులు*), శుభ్‌మన్ గిల్ (58 పరుగులు*) జింబాబ్వే బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నారు.

యశస్వి-గిల్ సునామీ బ్యాటింగ్.. 

జింబాబ్వే నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ వరుస ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ఆరంభం నుంచే బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ జింబాబ్వేకు ఎక్క‌డా ఛాన్స్ ఇవ్వ‌లేదు. యశస్వి 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులతో సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ 39 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేశాడు. గిల్ త‌న ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ కేవలం 15.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్, బౌలింగ్ లో జింబాబ్వే ఫ్లాప్.. 

జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ మాధవెరె (25), మారుమణి (32) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు, అయితే వీరిద్ద‌రూ ఔట్ అయిన త‌ర్వాత జింబాబ్వే బ్యాటింగ్ లో తడబడింది. వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ సికందర్ రజా 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు మంచి స్కోరును అందించాడు. కానీ, ఈ పరుగులు విజయానికి సరిపోలేదు. భారత్ తరఫున ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబేలు ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లెజెండరీ బౌలర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios