WPL 2024 : ముంబై చిత్తు.. ఫైనల్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
IPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో ఎలిమినేటర్ రౌండ్ లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో డబ్ల్యూపీఎల్ 2024లో లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
WPL 2024 - Royal Challengers Bangalore: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండవ సీజన్ తుదిదశకు చేరుకుంది. 20 ఓవర్ల ఈ క్రికెట్ లీగ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. లీగ్ రౌండ్ ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది. లీగ్ రౌండ్‌లో 2వ, 3వ స్థానాల్లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎలిమినేషన్ రౌండ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొంది. ముంబైని చిత్తుచేసిన బెంగళూరు టీమ్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది.
బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ 66 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. అనంతరం 136 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ముంబయి విజయానికి చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, ముంబై 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ముంబయి విజయానికి చివరి బంతికి 7 పరుగులు కావాలి. సిక్స్ కొడితే మ్యాచ్ డ్రా అవుతుంది. కానీ, చివరి బంతికి ముంబై ఒక్క పరుగు మాత్రమే చేసింది.
ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్-5 క్రికెటర్లు వీరే..
చివరికి 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల ప్రీమియర్ లీగ్ క్రికెట్ లీగ్ లో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆదివారం ఢిల్లీలో క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Tata IPL 2024 కు దూరమైన టాప్-8 స్టార్ క్రికెటర్లు.. ఎందుకంటే..?