Asianet News TeluguAsianet News Telugu

WPL 2024: ఆర్సీబీతో పెట్టుకుంటే అట్లుంట‌ది.. బిగ్ సిక్సర్ తో కారు అద్దం ప‌గుల‌కొట్టిన ఎలీస్ పెర్రీ

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ రెండో ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శనతో తొలి 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే, ఆర్బీబీ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ కొట్టిన సిక్సర్ దృశ్యాలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.
 

WPL 2024: Ellyse Perry smashes car mirror with big six  RCB vs UPW WPL Highlights RMA
Author
First Published Mar 5, 2024, 3:54 PM IST

RCB - Ellyse Perry : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ తన ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో మ‌రోసారి మెరుపులు మెరిపించింది. సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన ఎల్లీస్ పెర్రీ.. తన పేలుడు ఇన్నింగ్స్‌తో కారు అద్దాన్ని పగులగొట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. డబ్ల్యూపీఎల్ 2024 టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో బెంగ‌ళూరు-యూపీ మ‌ధ్య ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్ జ‌రిగింది. ఆతిథ్య జట్టు ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది.

సిక్స్ తో కారు అద్దం ప‌గుల‌కొట్టిన  ఎలీస్ పెర్రీ

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. మ్యాచ్ గెలుపు కోసం మొద‌టి నుంచే దూకుడు పెంచిన ఆర్బీబీ ప్లేయ‌ర్లు తొలి ఓవర్ నుంచే చెలరేగి ఆడారు. కెప్టెన్ స్మృతి మంధాన (80), ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ (58) అద్భుత అర్ధశతకాలు సాధించడంతో జట్టు 20 ఓవర్లలో 198/3 భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సబ్బినేని మేఘన (28), వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ (21 నాటౌట్) చక్కటి సహకారం అందించారు.

2 ప్రపంచ కప్‌లు, 5 ఐపీఎల్ టైటిల్స్.. కానీ, కెరీర్‌లో అదొక్క‌టి సాధించ‌లేక‌పోయిన ఎంఎస్ ధోని !

ధ‌నాధన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఎల్లీస్ పెర్రీ ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ 37 బంతుల్లో 4 ఫోర్లు, 4  సిక్సర్లతో 58 పరుగులు చేసింది. ఆమె పేలుడు ఇన్నింగ్స్‌లో అద్భుత‌మైన ఒక సిక్స‌ర్ తో ప్లేయ‌ర్ల‌తో పాటు గ్రౌండ్ లో ఉన్న‌వారు షాక్ తో పాటు ఆశ్చర్యంతో ఇచ్చిన రియాక్ష‌న్స్ వైర‌ల్ అవుతున్నాయి. దీనికి కార‌ణంగ ఎలీస్ పెర్రీ కొట్టా ఆ సిక్స‌ర్ తో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ కోసం ఉంచిన కారు అద్ద‌లు ప‌గిలి పోయాయి. దీని వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించింది. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఎల్లీస్ పెర్రీ ఈ సిక్సర్ కొట్టింది.

పెర్రీ పవర్‌ను చూసి స్టేడియంలోని అభిమానులు విపరీతంగా అరుస్తూ క‌నిపించారు. 33 ఏళ్ల వెటరన్ బ్యాట్స్‌మెన్, ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ కారు అద్దం ప‌గిలిన వెంట‌నే తన తలపై చేతులు వేసి, ఆమె సిక్స్ కొట్టిన కారును చూసి షాక్ అయ్యింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పెర్రీ భారీ షాట్‌తో తన వికెట్‌ను కోల్పోయింది. మ్యాచ్ అయిపోయాక పెర్రీ మాట్లాడుతూ.. త‌న సిక్స‌ర్ తో అక్క‌డుంచిన కారుకు క‌లిగిన నష్టం చెల్లించడానికి త‌న‌కు బీమా ఉందో లేదో తెలియదని స‌ర‌దాగా పేర్కొంది. అలాగే, ఇక్క‌డ ఆడ‌టం మంచి అనుభూతిని క‌లిగిస్తోంద‌నీ, ప్రేక్ష‌కుల‌తో మంచి స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగులతో విజయం సాధించింది. 80 పరుగులతో సాధించిన కెప్టెన్‌ స్మృతి మంధానకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.


టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

Follow Us:
Download App:
  • android
  • ios