Asianet News TeluguAsianet News Telugu

2 ప్రపంచ కప్‌లు, 5 ఐపీఎల్ టైటిల్స్.. కానీ, కెరీర్‌లో అదొక్క‌టి సాధించ‌లేక‌పోయిన ఎంఎస్ ధోని !

MS Dhoni: 2007 టీ20 ప్రపంచకప్‌లో స‌మ‌యంలో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్లు టీమిండియాకు దూరంగా ఉన్నప్పుడు ఎంఎస్ ధోని ఊహించని విధంగా కెప్టెన్ కావ‌డంతో పాటు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 
 

2 World Cups, 5 IPL titles but, MS Dhoni has not been able to achieve that in his career RMA
Author
First Published Mar 5, 2024, 2:28 PM IST

MS Dhoni: మ‌హేంద్ర సింగ్ ధోని..  క్రికెట్ చరిత్ర‌లో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. భారత క్రికెట్‌ చరిత్రతో పాటు అంత‌ర్జాతీయంగా అత్యుత్తమ కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని గుర్తింపు సాధించాడు. ధోని తన కెరీర్‌లో టీ20, వన్డే ప్రపంచకప్ టైటిళ్లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించారు. ఇలా మూడు ఫార్మాల్ ల‌లో భార‌త్ ఛాంపియ‌న్ గా నిలిపిన కెప్టెన్ గా చ‌రిత్ర సృష్టించాడు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం, వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచాడు.

2007 టీ20 ప్రపంచకప్‌లో భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు చాలా మంది టీమ్ కు దూర‌మ‌య్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్లు అందరూ భార‌త జ‌ట్టుకు దూరంగా ఉన్నప్పుడు ధోనీ అనూహ్యంగా కెప్టెన్ అయ్యాడు. యువరాజ్ సింగ్ కెప్టెన్ అవుతాడని అభిమానులు భావించినప్పుడు.. సెలెక్టర్లు ధోనీని కెప్టెన్‌గా చేశారు. ఆ త‌ర్వాత టీమిండియా క్రికెట్ ప్ర‌పంచ‌లో స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. కెప్టెన్‌గా తొలి ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్‌ను అందించిన ధోనీ ఆ తర్వాత భారత క్రికెట్‌లో అసమానమైన స్టార్‌గా ఎదిగాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో దశాబ్ద కాలంగా భారత్‌కు కెప్టెన్‌గా, కీపర్‌గా సేవ‌లు అందించి దిగ్గ‌జ ప్లేయ‌ర్ గా పేరు సంపాదించాడు.

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

కెరీర్‌లో సాధించగలిగినవన్నీ సాధించినా, ధోనీ కెరీర్‌లో సాధించలేని ఘనత ఒకటి ఉంది. అదేంట‌ని అనుకుంటున్నారా? అదే సెంచ‌రీల‌కు సంబంధించిన అంశం. వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో ఆరు సెంచరీలు చేశాడు. అయితే ఇవన్నీ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ఉన్నాయి. ఆసియా వెలుప‌ల ధోని సెంచ‌రీని సాధించ‌లేక‌పోయాడు. కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 95 పరుగులు చేశాడు, అయితే ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.

ఇక 2010 దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ టెస్టులో 90 పరుగులు చేయడం ద్వారా ధోని సెంచరీకి చేరువయ్యాడు, కానీ మూడంకెల మార్కును అందుకోలేక‌పోయాడు. ఆసియా వెలుపల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల‌పై 5 సార్లు 80-90 ప‌రుగుల వ‌ద్ద‌కు చేరుకున్నాడు కానీ, సెంచ‌రీని అందుకోలేక‌పోయాడు. వన్డేలు, టీ20ల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం వల్లే సెంచరీలు చేయలేదని చెప్పొచ్చు కానీ, టెస్టుల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా ధోనీ రాణించలేకపోవడం అతని కెరీర్‌లో పెద్ద గ్యాప్‌గా మిగిలిపోయింది.

6 బంతుల్లో ఆరు సిక్స‌ర్లు.. మ‌రో భార‌త ప్లేయ‌ర్ సంచ‌ల‌న బ్యాటింగ్ !

 

Follow Us:
Download App:
  • android
  • ios