ఆ ఆటగాడిని తీసుకోకపోతే వరల్డ్ కప్ తప్పులే రిపీట్ అవుతాయి - మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (icc t20 world cup 2024)కు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను టీమ్ లోకి గత టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2020) తప్పులే రిపీట్ అవుతాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) హెచ్చరించాడు. ఆయనను టీమ్ లోకి తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు యశస్వి జైస్వాల్ ను టీమ్ లోకి తీసుకోకపోవడం అన్యాయమని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇండోర్ వేదికగా అఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో టీ20లో జైస్వాల్ హాఫ్ సెంచరీతో భారత్ సిరీస్ విజయం సాధించించిన సంగతి తెలిసిందే. భారత్ విజయం అనంతరం ఆకాశ్ చోప్రా ‘జియో సినిమా’తో మాట్లాడారు. టీ20ల్లో శుభ్ మన్ గిల్ కంటే జైస్వాల్ ముందున్నాడని తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్..
‘‘యశస్వి బ్యాటింగ్ చేస్తున్న తీరు అద్భుతం. అతడిని సెలెక్ట్ చేయకపోతే అన్యాయమే అవుతుంది. ఆయన ఎంపికకు అర్హుడు. అందుకే పరుగులు చేస్తూ ఇక్కడకు వచ్చాడు. ఇప్పుడు అతను (శుభ్ మన్ ) గిల్ ను మించిపోయాడు. కానీ ఇప్పుడు అతడిని ముట్టుకోలేం' అని చోప్రా పేర్కొన్నారు.
అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఏం తేడా లేదు - రేవంత్ రెడ్డి..
టీ 20 వరల్డ్ కప్ కు జైస్వాల్ ను ఎంపిక చేయకపోతే 2022 టీ20 ప్రపంచకప్ తో తమను వెంటాడుతున్న స్లో స్పీడ్ టెంపోను భారత్ రిపీట్ చేసే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా హెచ్చరించారు. ‘‘జైస్వాల్ ను ఎంపిక చేయపోతే ఆట మళ్లీ 2022 మాదిరిగానే ఉంటుంది. మళ్లీ అంతా ఒకేలా ఉంటుంది. శైలి ఒకేలా ఉంటుంది, సంవత్సరం మాత్రమే మారుతుంది.’’ అని చోప్రా అన్నారు.
ఇట్ల కూడా రోడ్లు వేస్తరా..? ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. వైరల్..
కాగా.. ఇప్పటివరకు 16 టీ20లు ఆడిన జైస్వాల్ 35.57 సగటుతో 163.81 స్ట్రైక్ రేట్తో 498 పరుగులు చేశారు. ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు సాధించగా, అతని అత్యుత్తమ స్కోరు 100గా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో కలిసి జైస్వాల్ ను స్టార్డమ్ లోకి నెట్టి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన జైస్వాల్ 48.07 సగటు, 163.61 స్ట్రైక్ రేట్తో 625 పరుగులు చేశాడు. 14 మ్యాచ్ లో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు సాధించి అత్యుత్తమ స్కోరు 124 పరుగులు చేశాడు. అతడు ఆర్ఆర్ టాప్ రన్ స్కోరర్, టోర్నమెంట్ లో మొత్తం ఐదో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.