India Women vs Australia Women: భార‌త వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ‌హిళ క్రికెట్ వ‌న్డే మ్యాచ్ నేప‌థ్యంలో టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా చూస్తుండ‌గా, త‌న జైత్ర యాత్ర‌ను కొన‌సాగించాల‌ని భార‌త మ‌హిళ జ‌ట్టు ఉత్సాహంతో ఉంది.  

India Women vs Australia Women, 1st ODI: ముంబై వేదిక‌గా జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్లు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ముంబయి వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత్‌ తొలిసారిగా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. తదుపరి 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ముంబైలో జరగనున్నాయి. గురువారం ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.

ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు ఆడిన 50 వన్డేల్లో 40 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. 10 మ్యాచ్ ల‌లో మాత్రమే విజ‌యం సాధించింది. అది కూడా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత 7 మ్యాచ్‌ల్లో భారత్‌కు కష్టాలు తప్పలేదు. కానీ, ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు మ్యాచ్ విజ‌యంతో చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. వ‌న్డే సిరీస్ లో కూడా అదే జోరును కొన‌సాగించాల‌ని చూస్తోంది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, షబాలీ వర్మ, ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ రేణుకా ఠాకూర్‌, స్పిన్నర్లు సినీ రాణా, శ్రేయాంక పాటిల్‌ తదితర స్టార్లు ఆస్ట్రేలియాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా జట్టు ప్రయత్నిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

రాక్ సాలిడ్ డిఫెన్స్, సూప‌ర్ బౌండ‌రీల‌తో అదరగొట్టిన కేఎల్ రాహుల్..