Asianet News TeluguAsianet News Telugu

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఎందుకు ఆడటం లేదు?

India vs South Africa 1st Test: సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు ఆడుతోంది. ప్రసిద్ధ్ కృష్ణకు అరంగేట్రం క్యాప్ ఇవ్వగా, రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కు చోటు క‌ల్పించారు.
 

Why is Ravindra Jadeja not playing India vs South Africa 1st Test RMA
Author
First Published Dec 26, 2023, 4:49 PM IST

India vs South Africa Live Score: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు డిసెంబర్ 26 మంగళవారం సెంచూరియన్ లోని  సూపర్స్ స్పోర్ట్ పార్క్ లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. కొన్ని నెలల క్రితం వెస్టిండీస్ ను తమ తమ సిరీస్ లో ఓడించిన తర్వాత రెండు క్రికెట్ దేశాలు ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ లోనూ తలపడకపోవడం గమనార్హం. అలాగే, భార‌త్ సౌతాఫ్రికాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. కానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు విజయంపై కన్నేసింది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన బాక్సింగ్ డే టెస్టులో ఇరు జట్లు తలపడుతుండగా, ప్రసిద్ధ్ కృష్ణకు అరంగేట్రం క్యాప్ లభించింది. ప్రసిద్ధ్ కృష్ణను ఎలెవన్ లో చేర్చడంతో పాటు ఒక ముఖ్యమైన మార్పు కూడా క‌నిపించింది. అదే జ‌ట్టు నుంచి జ‌డేజాను త‌ప్పించ‌డం. అస‌లు జ‌డేజా ఈ మ్యాచ్ లో ఎందుకు ఆడ‌టం లేదు? జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కు ఎందుకు చోటు క‌ల్పంచార‌నేది గ‌మ‌నిస్తే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జ‌డేజా అనారోగ్యానికి గుర‌య్యార‌ని స‌మాచారం. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున జడేజా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ధృవీకరించిన రోహిత్ శ‌ర్మ‌.. అత‌ని స్థానంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్టు తెలిపాడు.  'జడేజా స్థానంలో అశ్విన్ ఆడుతున్నాడు. జడ్డూకు వెన్నునొప్పి ఉంది, కాబట్టి అశ్విన్ వచ్చాడు. అను నాణ్యమైన స్పిన్నర్" అని రోహిత్ టాస్ సందర్భంగా చెప్పాడు.

ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించిన సందర్భంగా బీసీసీఐ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. 'మ్యాచ్ జరిగిన రోజు ఉదయం రవీంద్ర జడేజా వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఇండియా-సౌతాఫ్రికా మొద‌టి టెస్టుకు అతడు అందుబాటులో లేడు' అని బీసీసీఐ పేర్కొంది.

 

 

INDIA VS SOUTH AFRICA 1ST TEST: క‌ష్టాల్లో భార‌త్.. మొద‌టి సెష‌న్ లోనే మూడు వికెట్లు డౌన్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios