Asianet News TeluguAsianet News Telugu

నాకో డౌట్.. నువ్వు నాలుక ఎందుకు బయటకు తీస్తావ్‌: టేలర్‌‌ను ప్రశ్నించిన భజ్జీ

న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కూడా ఎక్కువ ఆనందానికి గురైన సమయంలో నాలుకను బయటకు తీసి పెదాలపై తిప్పుతూ ఉంటాడు. శతకం బాదితే కనుక ఖచ్చితంగా నాలుకతో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు టేలర్. 

why do you put tongue out every time you score 100: harbhajan asks ross taylor
Author
Hamilton, First Published Feb 6, 2020, 5:23 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న పలువురు  క్రికెటర్లకు ప్రత్యేకంగా మేనరిజాలు వున్న సంగతి తెలిసిందే. సెంచరీ చేసినప్పుడో, వికెట్లు తీసినప్పుడో లేదంటే మెరుపు ఫీల్డింగ్ చేసినప్పుడో కొందరు ప్రత్యేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. అవి వారి అభిమానులకు బాగా దగ్గరవుతూ ఉంటాయి.

అలాగే న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కూడా ఎక్కువ ఆనందానికి గురైన సమయంలో నాలుకను బయటకు తీసి పెదాలపై తిప్పుతూ ఉంటాడు. శతకం బాదితే కనుక ఖచ్చితంగా నాలుకతో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు టేలర్.

Also Read:మేం బాగానే ఆడాం.. కానీ అంతా అతని వల్లే : ఓటమిపై కోహ్లీ స్పందన

ఆయన ఇలా నాలుకను ఎందుకు బయటకు తీస్తాడు అనేది చాలా మంది క్రికెట్ అభిమానుల ప్రశ్న. ఇప్పుడు అదే డౌట్ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు వచ్చింది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసి జట్టుకు మంచి విజయాన్ని అందించిన రాస్ టేలర్‌ను ప్రశంసిస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు

 ‘‘అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు టేలర్.. కానీ నువ్వు నాకో విషయం చెప్పాల్సి ఉంటుంది. నువ్వు సెంచరీ చేసిన ప్రతీసారి నాలుకను ఎందుకు బయటకు తీస్తావ్’’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Also Read:కివీస్ విజయంలో కీలకపాత్ర: మన బుమ్రానేనా అంటున్న ఫ్యాన్స్

కాగా కివీస్ జట్టులో వందకు పైగా వన్డేలు, వంద టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్ రాస్ టేలరే. ప్రస్తుతం 99 టెస్టుల వద్ద వున్న టేలర్.. త్వరలో భారత్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో 100 టెస్టుల ఆడిన వ్యక్తి కానున్నాడు. ఇదే జరిగితే టెస్ట్, వన్డే, టీ20లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రాస్ టేలర్ ప్రపంచ రికార్డును సృష్టిస్తాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios