న్యూజిలాండ్ గడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు జైత్రయాత్రకు కివీస్ ఎట్టకేలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read:ఐదో స్థానంలోనూ అదరగొట్టేశాడు.. కత్తి కంటే పదునైనోడు: రాహుల్‌పై కైఫ్

ఈ ఓటమిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. తమ నుంచి టామ్ లేథమ్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని చెప్పాడు. భారీ లక్ష్య ఛేదనలో అతను కేవలం 48 బంతుల్లోనే 69 పరగులు చేశాడని ప్రశంసించాడు.

మధ్య ఓవర్లలో టేలర్, టామ్ ఇద్దరూ చెలరేగి ఆడారని.. కివీస్ విజయానికి పూర్తిగా అర్హులని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కుల్‌దీప్ యాదవ్ ఎక్కువ పరుగులు ఇవ్వడం, టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంపైనా విరాట్ మాట్లాడాడు.

Also Read:కివీస్ విజయంలో కీలకపాత్ర: మన బుమ్రానేనా అంటున్న ఫ్యాన్స్

ఒక్క అవకాశంతోనే గెలుపు సాధ్యమవ్వదని.. తాము బాగానే ఆడామని, అయితే నిరంతరం తాము మేరుగవ్వాలన్నాడు. ప్రతికూల అంశాలపై ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టకూడదని.. ఈ రోజు కివీస్ మా కంటే బాగా ఆడిందని కోహ్లీ అన్నాడు.

అలాగే సెంచరీ ద్వారా జట్టుకు భారీ స్కోరును అందించిన శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కొత్త ఓపెనర్ల ప్రదర్శనపైనా సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా శ్రేయస్, కేఎల్ రాహుల్ ‌మళ్లీ ఇరగదీశాడని కొనియాడాడు.