Asianet News TeluguAsianet News Telugu

బట్లర్‌తో అశ్విన్ తొండాట: మన్కడింగ్ అంటే ఏమిటి..?

రవిచంద్రన్ అశ్విన్, జాస్ బట్లర్‌ల మధ్య జరిగిన మన్కడింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్-2019లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు

what is mankading and its rules
Author
Jaipur, First Published Mar 26, 2019, 11:51 AM IST

రవిచంద్రన్ అశ్విన్, జాస్ బట్లర్‌ల మధ్య జరిగిన మన్కడింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్-2019లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు.

ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బట్లర్ బంతి వేయకముందే క్రీజు వదిలి ముందుకు వెళ్లాడు. దీంతో అశ్విన్ బాల్ వేస్తున్నట్లుగా చేసి బంతిని వికెట్లకు తాకించి బట్లర్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. అయితే అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. 

మన్కడింగ్ అంటే:

బౌలర్ బంతి విసరడానికి ముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్ రనౌట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు.

1948 ఆసీస్ పర్యటనలో భాగంగా భారత బౌలర్ వినూ మన్కడ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ బిల్‌బ్రౌన్‌ను ఇలాగే రెండు సార్లు ఔట్ చేశాడు. దీంతో ఆయన పేరు మీదుగానే ఈ విధానానికి ‘‘మన్కడింగ్’’ అని పేరు వచ్చింది.

అయితే మన్కడింగ్‌ను అప్పట్లో ఆసీస్ మీడియా క్రీడా స్పూర్తికి విరుద్ధమని కథనాలు రాసింది. కానీ లెజండరీ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ ఈ విధానాన్ని అంగీకరించడం విశేషం. అయితే పద్ధతికి కూడా నిబంధనలు రూపొందించింది ఐసీసీ.

నాన్‌స్ట్రైకర్ క్రీజు వదిలి ముందుకు వెళితే.. బౌలర్ ఒకసారి హెచ్చరించిన తర్వాత ఔట్ చేయొచ్చు. అయితే 2017 నవంబర్ తర్వాత ఈ నిబంధనలోనూ మార్పు చేశారు. ఇకపై ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్లను రనౌట్ చేయొచ్చు. 

బట్లర్‌తో అశ్విన్ తొండాట: మన్కడింగ్ అంటే ఏమిటి..?

‘మన్కడింగ్’ ఔట్: అశ్విన్ భార్యాపిల్లలను టార్గెట్ చేసిన నెటిజన్లు

ఐపిఎల్ 2019: రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ విజయం

Follow Us:
Download App:
  • android
  • ios