Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ 2019: రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ విజయం

ఐపిఎల్ 2019 లో భాగంగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. బట్లర్ విచిత్రంగా అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. బట్లర్ అవుటైన తర్వాత రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

rajasthan royals vs kings leven punjab match updates
Author
Jaipur, First Published Mar 25, 2019, 8:04 PM IST

ఐపిఎల్ 2019లో భాగంగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ ఓపెనర్లు అజింక్యా రహానే, బట్లర్ శుభారంభాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరుకున్నారు. బట్లర్ విచిత్రంగా రన్నవుట్ కావడమే మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా, రాజస్థాన్ రాయల్స్ 9ి వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.పంజాబ్ బౌలర్లలో కుర్రాన్, రాజ్ పూత్, రెహ్మాన్ రెండేసి వికెట్లు తీసుకోగా, అశ్విన్ కు ఒక్క వికెట్ లభించింది.

ఐపిఎల్ లో భాగంగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ 163 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అర్చర్ 2 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. ఆ సమయంలో 7 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్తాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ 164 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఉనద్కత్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రాజస్థాన్ రాయల్స్ 164 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది, గౌతమ్ 3 పరుగులు చేసి రాజపూత్ బౌలింగులో అవుటయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్ 157 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ ఓ సిక్సర్ బాది ఆ తర్వాత వెంటనే ముజీబ్ ఉర్ రెహ్మాన్ అవుటయ్యాడు. ఆతర్వాత ఒక్క పరుగు మాత్రమే జోడించి మరో వికెట్ కోల్పోయింది.త్రిపాఠి 1 పరుగు చేసి ముజీబ్ ఉర్ రెహ్మాన్ చేతిలో అవుటయ్యాడు.అంతకు ముందు 150 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. సంజూ శాంప్సన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుర్రాన్ బౌలింగులో అవుటయ్యాడు.

రాజస్థాన్ రాయల్స్ 148 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కుర్రాన్ వేసిన బంతిని స్మిత్ గాలిలోకి లేపాడు. రాహుల్ అద్భుతమైన క్యాచ్ ద్వారా స్మిత్ ను ఔట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ 108 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ ను అశ్విన్ అనూహ్యంగా, గమ్మత్తుగా ఔట్ చేశాడు. తాను బౌలింగ్ వేస్తున్న సమయంలో బంతిని వేయక ముందే నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న బట్లర్ క్రీజ్ దాటాడు. దాన్ని గమనించి బౌలింగ్ చేయడాన్ని ఆపేసి వికెట్లను గిరాటు వేశాడు. దీంతో బట్లర్ 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఈ సమయంలో బట్లర్ కు, అశ్విన్ కు మధ్య కాస్తా వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. 

ఎట్టకేలకు పంజాబ్ రాజస్థాన్ రాయల్ వికెట్ ఒక్కటి తీయగలగింది. అశ్విన్ బౌలింగులో అజింక్యా రహానే 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అప్పటికి రాజస్థాన్ రాయల్స్ ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అంతకు ముందు బట్లర్ అర్థ సెంచరీ చేశాడు. 29 బంతుల్లో అతను 2 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.

ఐపిఎల్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన తర్వాత సర్భరాజ్ ఖాన్, మణ్ దీప్ సింగ్ వికెట్ పడకుండా పరుగులు సాధించారు. సర్ఫరాజ్ ఖాన్ 29 బంతుల్లో ఓ సిక్స్, ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మణ్ దీప్ సింగ్ రెండు బంతుల్లో 5 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో స్టోక్స్ రెండు వికెట్లు తీయగా, గౌతమ్, కులకర్ణిలకు తలో వికెట్ దక్కాయి. అంతకు ముందు గేల్ విధ్వంసానికి తెరపడింది. కేవలం 47 బంతుల్లోనే 79 పరుగులు చేసిన అతడు మరో సిక్స్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 144 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోెయింది. రాజస్థాన్ బౌలర్ ఉనద్కత్ పై ఒకే ఓవర్లో విరుచుకుపడి గేల్ ఏకంగా హ్యాట్రిక్ పోర్లు, ఓ సిక్సర్ బాది ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. దీంతో కేవలం 34 బంతుల్లోనే 53 పరుగులకు చేరుకున్నాడు. 

పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోగా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న సమయంలో మయాంక్ అగర్వాల్ ఔటయ్యాడు. గౌతమ్ బౌలింగ్ లో అగర్వాల్  బౌండరీకి ప్రయత్నించగా కుల్ కర్ణి అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. దీంతో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్ అగర్వాల్ ఔటయ్యాడు.  

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫోర్ తో ఇన్నింగ్స్ ఆరంభించి మంచి ఊపుమీదున్నట్లు కనిపించినా వెంటనే  ఔయ్యాడు. కుల్ కర్ణి బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

రాజస్థాన్ రాయల్స్: 

అజింక్యా రహానే (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీఫర్), స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాటి, గౌతమ్, జోప్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్,  దవల్ కుల్ కర్ణి

కింగ్స్ లెవెన్ పంజాబ్:

రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), కెఎల్.రాహుల్(వికెట్ కీఫర్), క్రిస్ గెల్, మయాక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరమ్, మన్ ధీప్ సింగ్, కుర్రమ్, మహ్మద్ షమీ, ముజీబ్ ఉల్ రెహ్మాన్, అంకిత్ రాజ్ పత్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios