MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : బుమ్రా గురించి మాటలు అనవసరం.. అదే మంచిది..: ధోని సంచలన కామెంట్స్

T20 World Cup 2026 : బుమ్రా గురించి మాటలు అనవసరం.. అదే మంచిది..: ధోని సంచలన కామెంట్స్

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.  ‘’బుమ్రా గురించి మాటలు అనవసరం'' అన్నారు… ఇలా ఎందుకన్నారో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 09 2026, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గంభీర్, బుమ్రా పై ధోని కామెంట్స్ వైరల్..
Image Credit : X/@Mufaddal_Vohra/@BCCI

గంభీర్, బుమ్రా పై ధోని కామెంట్స్ వైరల్..

ICC Men's T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 విజేత భారత్ కు సోషల్ మీడియాలో జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మాజీ ఆటగాళ్లు, సాధారణ ప్రజల వరకు ప్రతీ ఒక్కరూ ఆటగాళ్లను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన గౌతమ్ గంభీర్ నవ్వును మెచ్చుకుంటూ, బుమ్రా గురించి ఏమీ రాయొద్దంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధోనీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీమిండియా విజయంపై ధోని పోస్ట్..
Image Credit : Instagram@mahi7781

టీమిండియా విజయంపై ధోని పోస్ట్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8, ఆదివారం) ఇండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. భారత జట్టు న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించి, మూడోసారి టీ20 వరల్డ్ కప్ అందుకోడాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే అద్భుత విజయం గురించి ధోనీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

35
గంభీర్ నవ్వుపై ధోని...
Image Credit : Instagram/House of Events

గంభీర్ నవ్వుపై ధోని...

'అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికే కాదు ఈ విజయం కాంక్షించిన క్రికెట్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి అద్భుతమైన ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది' అని ఇన్స్టాలో రాసుకొచ్చారు. 

ఇక టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా ధోని ప్రస్తావించారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే గంభీర్ టీ20 విజయం తర్వాత కాస్త నవ్వుతూ కనిపించారు. దీంతో ''మీ ముఖంలో నవ్వు చూడటానికి చాలా అందంగా ఉంది. ఉత్సాహంతో కూడిన ఆ చిరునవ్వు అద్భుతం'' అంటూ గంభీర్ నవ్వు గురించి కామెంట్స్ చేశారు. ‘’చాలా బాగా ఆడారు... ఎంజాయ్ గయ్స్'' అంటూ టీమిండియా ప్లేయర్స్ ను అభినందించారు.

45
బుమ్రా గురించి ఏమీ రాయను...: ధోని
Image Credit : Getty

బుమ్రా గురించి ఏమీ రాయను...: ధోని

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా ధోని రియాక్ట్ అయ్యారు. 'బుమ్రా గురించి ఏమీ రాయకపోవడమే మంచిది, అతను ఛాంపియన్ బౌలర్' అంటూ తన పోస్ట్ ముగించారు. సోషల్ మీడియాలో ధోనీ పెట్టిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యింది. దీనికి 1.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

55
2 ఏళ్ల తర్వాత ధోని పోస్ట్
Image Credit : AFP

2 ఏళ్ల తర్వాత ధోని పోస్ట్

ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరన్న విషయం తెలిసిందే. ఆయన చివరిసారిగా 2024 జులై 14న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి సందర్భంగా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు 14 మిలియన్ల మంది లైక్ కొట్టారు. అంతకు ముందు 2024 టీ20 వరల్డ్ కప్ విజయంపై పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఎస్ ధోనీకి సుమారు 50 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఎం.ఎస్. ధోని
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Now Playing
India Win T20 World Cup 2026: T20 ట్రోఫీతో హనుమాన్ ఆలయంలో పూజలు | Cricket News | Asianet News Telugu
Recommended image2
T20 World Cup 2026 : టీమిండియాలో 11 మందీ హీరోలే.. వరల్డ్ కప్ విజయంలో ఎవరి పాత్ర ఏంటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved