లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. దీంతో పలువురు కుటుంబంతో ఏంజాయ్ చేస్తుండగా, మరికొందరు ఇంటి పనుల్లో అమ్మ, భార్య తదితరులకు సాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో కొన్ని సంగతులు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తీరుపట్ల వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ విసుగెత్తిపోయాడు.

Also Read:డివిలియర్స్‌తో కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లైవ్.. అనుష్కకి ఏం చెప్పాడంటే..

చాహల్ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. టిక్‌టాక్‌లో ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతుంటాడు. అతను చేసే సరదా వీడియోలతో టీమిండియా క్రికెటర్లు సైతం విసుగెత్తిపోయారు.

గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు సైతం చాహల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో గేల్ చేరాడు. ‘‘ నీ టిక్ టాక్ వీడియోలతో విసుగెత్తిపోయాను.. నిన్ను బ్లాక్ చేయాలని టిక్‌టాక్ వాళ్లకు చెబుతానంటూ క్రిస్‌గేల్ వార్నింగ్ ఇచ్చాడు.

Also Read:ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది: భువనేశ్వర్ కుమార్

సోషల్ మీడియాలో నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు... నువ్వు సోషల్ మీడియాల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. నీతో విసుగెత్తిపోయాం... తన జీవితంలో మళ్లీ నిన్ను చూడాలనుకోట్లేదు, నిన్ను బ్లాక్ చేస్తున్నా అని క్రిస్‌గేల్ పేర్కొన్నాడు.

టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. డివిలియర్స్‌‌తో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుతూ చాహల్‌ను ట్రోల్ చేశాడు. ‘‘ అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాడు ఇలా చేస్తాడంటే నువ్వుస్సలు నమ్మలేవు. చాహల్‌కు ఇప్పుడు 29 ఏళ్లు.. ఒకసారి అతడి టిక్‌టాక్ వీడియోలు చూస్తే, ఖచ్చితంగా జోకర్‌లా ఉంటాడు అని కోహ్లీ అన్నాడు.