చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు విండీస్ స్టార్ డ్వేన్ బ్రావో. ఐపీఎల్‌లో సీఎస్‌కే జట్టు ఓ కుటుంబంలా ఉంటుందని, ఇతరుల విజయాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని అతను చెప్పాడు.

జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు మెరుగవ్వడానికి కారణం సీఎస్‌కే యాజమాన్యమే... తనలో అత్యుత్తమ ఆటగాడిని సీఎస్‌కేనే వెలికితీసింది. కెప్టెన్ థోనీ, కోచ్ ఫ్లెమింగ్‌ను ఎంతో విశ్వసిస్తానని బ్రావో చెప్పాడు.

Also Read:అప్పుడు సచిన్, యువరాజ్‌లు లేకుంటే ఏమయ్యేవాడినో: గతాన్ని గుర్తుచేసుకున్న శ్రీశాంత్

వారు స్వేచ్ఛగా ఆడటానికి అవకాశం ఇస్తారని... వ్యక్తిత్వ ప్రదర్శనల కంటే జట్టు గెలుపే మాకు ముఖ్యమన్నాడు. ఇతరుల విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తాం... చెన్నై జట్టులో ఉండే అనుకూల వాతావరణం మరే ఇతర జట్లలో ఉండదని బ్రావో అభిప్రాయపడ్డాడు.

ఆటగాడిలో ఉన్న ప్రతిభ బయటకు రావడంలో జట్టు యాజమాన్యం, సారథి ఆటగాళ్లకు అండగా నిలవడం ఎంతో ముఖ్యమని ఈ విండీస్ స్టార్ అన్నాడు. ప్లేయర్లు విఫలమైనప్పుడు సీఎస్‌కే మరో అవకాశం ఇస్తుందని బ్రావో గుర్తుచేసుకున్నాడు.

Also Read:ధోని వల్లే చిన్న నగరాల క్రికెటర్లు జట్టులోకి రావడం సాధ్యపడింది

2011 నుంచి డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా కరోనా కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది.

అయితే ఆ తర్వాత కూడా దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ క్రమంలో పరిస్ధితులు చక్కబడే వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.