Asianet News TeluguAsianet News Telugu

టీ20 ప్రపంచకప్‌లో దంచికొట్టారు.. రికార్డుల మోత మోగించారు..

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024లో ఒకే ఓవర్‌లో 36 పరుగుల నుంచి అత్యధిక పవర్‌ప్లే స్కోరు వరకు అనేక రికార్డులు బద్దలయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డుల మోత మోగించింది. 
 

West Indies beat Afghanistan in T20 World Cup A lot of records have been broken RMA
Author
First Published Jun 19, 2024, 11:15 AM IST

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభ స‌మ‌యంలో క్రికెట్ విశ్లేష‌కులు కరేబియన్ జట్టు వెస్టిండీస్ ను తక్కువ అంచ‌నా వేశారు కానీ, ఇప్పుడు ఆ జ‌ట్టు ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు స‌వాల్ విసురుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ తో దుమ్మురేపుతూ వ‌రుస విజ‌యాల‌తో టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే సూప‌ర్-8 కు చేరిన అతిథ్య జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం నుంచి త‌న అధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజాగా జ‌రిగిన మ్యాచ్ లోనూ ఆఫ్ఘనిస్తాన్‌పై అద‌రిపోయే ఆట‌తో రికార్డుల మోత మోగించింది. ఈ మ్య‌చ్ లో ఏకంగా 104 ప‌రుగుల తేడాతో విండీస్ జ‌ట్టు విజ‌యాన్ని అందుకుంది.

2024 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు..

ఎన్నో విజయాలు సాధించిన ఈ టోర్నమెంట్ లో రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచిన విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు అత్యధికంగా న‌మోదుచేసింది. టీ20 ప్రపంచకప్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ పై 218 పరుగులతో భారత్ తో కలిసి నాలుగో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా విండీస్ నిలిచింది.

ఒక ఓవర్‌లో 36 ప‌రుగులు

రెండో ఓవర్‌లో బ్రాండన్ కింగ్ ఔటైన తర్వాత నికోలస్ పూరన్ బ్యాటింగ్‌లోకి వచ్చి ఆఫ్ఘన్ బౌలర్లను ఉతికిపారేశాడు. ఫోర్లు, సిక్స‌ర్లతో విరుచుకుప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే ఒకే ఓవ‌ర్ లో 36 ప‌రుగులు రాబ‌ట్టాడు. దీంతో టీమిండియా స్టార్లు యురాజ్ సింగ్, రోహిత్ శ‌ర్మ‌ల స‌ర‌స‌న చేరాడు.

టీ20 ప్రపంచ కప్‌లలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్

టీ20 ప్రపంచ కప్‌లలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్ సాధించిన జ‌ట్టుగా వెస్టిండీస్ రికార్డు సృష్టించింది. ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ 92 పరుగుల అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అంత‌కుముందు, నెదర్లాండ్ 2014లో ఐర్లాండ్‌పై 91 పరుగులు చేసి రికార్డును  సాధించింది. మొత్తం టీ20 క్రికెట్ లో ఇది నాల్గవ అత్యధికం.

నికోల‌స్ పూరన్ విధ్వంసం

వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్ నికోల‌స్ పూరన్ ఈ మ్యాచ్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప‌రుగుల సునామీ సృష్టించాడు. 98 పరుగులతో త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాదాడు. ఈ క్ర‌మంలోనే టీ20ల్లో 2000 పరుగుల మార్క్‌ను దాటిన తొలి వెస్టిండీస్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ప్ర‌పంచ క‌ప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా సాధించాడు.

అత్యధిక సిక్సర్లు రికార్డు

టీ20ల్లో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో అత్యధిక సిక్సర్లు(128) బాదిన క్రిస్ గేల్ రికార్డును నికోల‌స్ పూర‌న్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో 98 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు బాదడంతో అత‌ని క్రిస్ గేల్ ను అధిగ‌మించాడు.

4 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. 3 వికెట్లు.. టీ20లో చ‌రిత్ర సృష్టించిన లాకీ ఫెర్గూసన్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios