Asianet News TeluguAsianet News Telugu

4 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. 3 వికెట్లు.. టీ20లో చ‌రిత్ర సృష్టించిన లాకీ ఫెర్గూసన్

Lockie Ferguson: న్యూజిలాండ్ పేస‌ర్ లాకీ ఫెర్గూసన్ అద్భుతమైన బౌలింగ్ తో టీ20 క్రికెట్ లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. వేసిన‌ నాలుగు ఓవర్లలో ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా మెయిడెన్లుగా మార్చిన  రెండో బౌలర్ గా ఘ‌న‌త సాధించాడు.
 

4 overs, 4 maidens, 3 wickets! Lockie Ferguson creates incredible T20I record,most economical spell in T20I histroy RMA
Author
First Published Jun 19, 2024, 12:35 AM IST | Last Updated Jun 19, 2024, 12:35 AM IST

Lockie Ferguson : న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్స్  చరిత్రలో తాను వేసిన ఓవ‌ర్ల‌లో ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా సూప‌ర్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. వేసిన నాలుగు ఓవ‌ర్ల బౌలింగ్ లో ఒక్ ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా 4 ఓవ‌ర్ల‌ను మెయిడెన్లుగా మార్చాడు. దీంతో పాటు 3 వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా ఇలాంటి గ‌ణాంకాలు న‌మోదుచేసిన రెండో బౌల‌ర్ గా నిలిచాడు.

అంత‌కుముందు, కెనడాకు చెందిన బౌల‌ర్ సాద్ బిన్ జాఫర్ ఈ రికార్డును న‌మోదుచేశాడు. నవంబర్ 2021లో టీ20 వరల్డ్ కప్ అమెరికాస్ రీజినల్ క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా జాఫర్ 4 ఓవ‌ర్ల బౌలింగ్ ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌లేదు. అలాగే, రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఫెర్గూసన్ మాత్రం మూడు వికెట్లు సాధించాడు. రైట్ ఆర్మ్ న్యూజిలాండ్ పేసర్ తన ఓవ‌ర్ మొదటి బంతికి  ప‌పువా న్యూగినియా కెప్టెన్ అసద్ వాలాను ఔట్ చేశాడు. 12వ ఓవర్ రెండో బంతికి రైట్ ఆర్మ్ పేసర్ చార్లెస్ అమినీని వికెట్ల ముందు పిన్ చేసి తన రెండో వికెట్ సాధించాడు. 14వ ఓవ‌ర్ లో మ‌రో వికెట్ తీసుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్‌లలో అత్యుత్తమ ఎకాన‌మీ గ‌ణాంకాలు 

  • 3/0 - లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్) vs పాపువా న్యూ గినియా, తరౌబా, 2024
  • 3/4 - టిమ్ సౌతీ (న్యూజిలాండ్) vs ఉగాండా, తరౌబా, 2024
  • 2/4 - ఫ్రాంక్ న్సుబుగా (ఉగాండా) vs పాపువా న్యూ గినియా, గయానా, 2024
  • 4/7 - అన్రిచ్ నోర్ట్జే (దక్షిణాఫ్రికా) vs శ్రీలంక, న్యూయార్క్, 2024
  • 2/7 - ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) vs ఉగాండా, తరౌబా, 2024

ఫెర్గూసన్ దెబ్బ‌కు న్యూజిలాండ్ పాపువా న్యూ గినియాను 78 పరుగులకే ఆలౌట్ చేసింది. పెర్గూస‌న్ కు తోడుగా ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఇష్ సోధీలకు తలో రెండు వికెట్లు ప‌డ్డాయి. సంక్షిప్త స్కోర్లు : పపువా న్యూ గినియా-19.4 ఓవర్లలో 78 ఆలౌట్ (లాకీ ఫెర్గూసన్ 3/0, టిమ్ సౌథీ 2/11, ట్రెంట్ బౌల్ట్ 2/14), న్యూజిలాండ్-79/3 (డేవాన్ కాన్వే 35, డారిల్ మిచెల్ 19, కేన్ విలిమ్స‌న్ 18 ప‌రుగులు).

టీ20 ప్రపంచ కప్ 2024 సూప‌ర్-8లో భార‌త్ గెల‌వాలంటే ఈ ప్లేయ‌ర్లు ఉండాల్సిందే.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios