పాకిస్థాన్‌ చిత్తు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఛాంపియన్ గా భారత్

WCL Final 2024, India vs Pakistan : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచేసింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని అందుకుంది.
 

WCL 2024: India Champions beat Pakistan Champions to lift World Championship of Legends trophy RMA

WCL Final 2024, India vs Pakistan : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ అద్భుత ప్రదర్శన చేసి పాకిస్థాన్ ఛాంపియన్‌ను ఓడించింది. టీమిండియా ఫైనల్ మ్యాచ్ గెలుపులో అంబటి రాయుడు కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇండియా ఛాంపియన్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్ ఫైనల్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత్ ఛాంపియన్స్ జ‌ట్టు పాకిస్తాన్ ఛాంపియన్‌లను 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగుల స్కోరుకు పరిమితం చేసింది. భార‌త బౌల‌ర్ల అద్భుత‌మైన బౌలింగ్ ప్రదర్శన ఈ మ్యాచ్ లో క‌నిపించింది. భారత ఛాంపియన్స్ తరఫున ఫాస్ట్ బౌలర్ అనురీత్ సింగ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే, భారత ఛాంపియన్స్ తరఫున వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో 1 వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ ఛాంపియన్స్ తరఫున షోయబ్ మాలిక్ అత్యధికంగా 41 పరుగులు చేశాడు. షోయబ్ మాలిక్ తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు బాదాడు.

ఫీల్డ్ లోనే యూస‌ఫ్ ప‌ఠాన్ తో ఇర్ఫాన్ ప‌ఠాన్ బిగ్ ఫైట్.. ఎమోష‌న‌ల్ వీడియో

బర్మింగ్‌హామ్‌లో  జ‌రిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ట్రోఫీని భారత్ ఛాంపియన్స్ కైవసం చేసుకుంది. ఇండియా ఛాంపియన్స్ తరఫున అంబటి రాయుడు ఫైనల్ మ్యాచ్‌లో 30 బంతుల్లో 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంబటి రాయుడు ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు గురుకీరత్ సింగ్ మాన్ 34 పరుగులు, యూసుఫ్ పఠాన్ 30 పరుగులు చేశారు. పాక్‌ తరఫున అమీర్‌ యమీన్‌ రెండు వికెట్లు తీశాడు. అలాగే, సయీద్ అజ్మల్, వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో వికెట్ ప‌డ‌గొట్టారు.

 

 

6 6 6 6 6 4.. మరోసారి యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios