Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ కోరిన రోహిత్ శర్మ... అంచనా తప్పిడంతో..

ఎబాదత్‌ వేసిన 13 ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్ని వరుసగా ఫోర్లు కొట్టిన రోహిత్‌.. ఐదో బంతిని డిఫెన్స్‌ ఆడబోగా అది ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. కాగా, అది ఔట్‌ కాదని భావించిన రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు

Watch: Error In Judgement Costs Rohit Sharma His Wicket
Author
Hyderabad, First Published Nov 23, 2019, 8:35 AM IST

టీమిండియా కోలోకతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా... బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ఈ మ్యచ్ లో రెండు జట్లు హోరా హోరీగా తలపడుతున్నాయి. రెండో రోజు ఆటలో భాగంగా భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కాసేటికి మయాంక్‌(14) వికెట్‌ను చేజార్చుకోగా, ఆపై రోహిత్‌ శర్మ(21)  కూడా పెవిలియన్‌ చేరాడు. దాంతో 43 పరుగులకే భారత్‌ రెండు వికెట్లను నష్టపోయింది. అల్‌ అమినన్‌ బౌలింగ్‌లో మెహిదీ హసన్‌కు గల్లీ పాయింట్‌లో మయాంక్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటైతే, రోహిత్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. 

AlsoRead అదరగొట్టిన రోహిత్ శర్మ.... బిత్తరపోయిన విరాట్ కోహ్లీ...

ఎబాదత్‌ వేసిన 13 ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్ని వరుసగా ఫోర్లు కొట్టిన రోహిత్‌.. ఐదో బంతిని డిఫెన్స్‌ ఆడబోగా అది ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. కాగా, అది ఔట్‌ కాదని భావించిన రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో ఆ బంతి ఆఫ్‌ స్టంప్‌పైన తాకుతున్నట్లు కనబడింది. ఫలితంగా రోహిత్‌ భారంగా పెవిలియన్‌ చేరాడు. ఇక్కడ రోహిత్‌ అంచనా తప్పడంతో భారత్‌ రివ్యూ కోల్పోయింది.

AlsoRead పింక్ బాల్ టెస్ట్.... విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్...

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్లు దూకుడుగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.  

Follow Us:
Download App:
  • android
  • ios